నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే క్రీడలు పండుగ టోక్యో ఒలంపిక్స్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే కరోనా వైరస్ ప్రభావంతో అసలు ఒలంపిక్స్ నిర్వహిస్తారా లేదా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రేక్షకులు అందరూ కూడా అనుమానం వ్యక్తం చేశారు. అయితే గత ఏడాది జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఒలంపిక్స్  నిర్వహిస్తారు అని ఎవరూ ఊహించలేదు. కానీ కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ కఠిన నిబంధనల మధ్య ఒలంపిక్స్ నిర్వహించాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఒక పెద్ద సాహసమే చేసింది జపాన్ ప్రభుత్వం.



 ఇక టోక్యో ఒలంపిక్స్ నిర్వహించేందుకు ఎన్నో రోజుల నుంచి తీవ్రస్థాయిలో కసరత్తు చేసి కఠినమైన నిబంధనలు మధ్య ప్రస్తుతం టోక్యో ఒలంపిక్స్ నిర్వహిస్తుంది. అయితే జపాన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలను   అమలు చేస్తున్నప్పటికీ అటు ఒలంపిక్ గ్రామంలో మాత్రం గత కొన్ని రోజుల నుంచి వరుసగా  వైరస్ కేసులు వెలుగులోకి వస్తూ ఉండటం సంచలనంగా మారిపోయింది.  పలు విభాగాలకు చెందిన క్రీడాకారులు వారికి సంబంధించిన సిబ్బంది కోచ్ లు సైతం వరుసగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 150కి పైగా క్రీడాకారులు సహా వివిధ సిబ్బంది కూడా వైరస్ బారిన పడ్డారు. వారందరిని కఠినమైన ఐసోలేషన్  లో ఉంచుతుంది జపాన్ ప్రభుత్వం.



 ఇదిలా ఉంటే ప్రస్తుతం టోక్యో నగరంలో కూడా రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది  దీంతో అక్కడి ప్రజలందరూ బెంబేలెత్తి ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక ఒలంపిక్స్ ప్రారంభం అయిన తరువాత తొలిసారిగా ఈ రోజు వారి అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదు కావడం గమనార్హం  ఈరోజు ఒక్కరోజు 3865 కేసులు నమోదయ్యాయి. వీరిలో 193 మంది ఒలంపిక్స్ క్రీడాకారులు,   మీడియా సిబ్బంది,ఇతర సిబ్బంది ఉన్నట్లు ఒక జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇక వైరస్ బారిన పడిన వారిలో కొందరు ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యపరంగా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ అక్కడి అధికారులు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: