ప్రస్తుతం భారత జట్టు శ్రీలంక పర్యటన లో ఉంది. శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే టి20 సిరీస్ ఆడుతుంది. అయితే ఇప్పటికే వన్డే సిరీస్ పూర్తిచేసుకున్న భారత జట్టు ఇక ప్రస్తుతం టీ20 సిరీస్ లో చివరి మ్యాచ్ ఆడుతుంది  కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించి ఇక ఈ రోజు టి 20 సిరీస్ పూర్తి చేసుకోబోతోంది టీమిండియా జట్టు. అయితే సాధారణంగా రెండు టీ 20 మ్యాచ్ లో కి మధ్య గ్యాప్ ఉంటుంది. కానీ కరోనా వైరస్ కారణంగా ఒక టి20 మ్యాచ్ వాయిదా పడడంతో ఇక రెండు t20 మ్యాచ్ లు వరుసగా జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్న రెండవ t20 మ్యాచ్ జరిగింది.



 ఇక నేడు మూడవ టి20 మ్యాచ్ మరి కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది.  ఈ క్రమంలోనే ఇక మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా గెలవగా రెండో టీ-20 మ్యాచ్లో శ్రీలంక జట్టు గెలిచింది. దీంతో ప్రస్తుతం 1-1 తో సమానంగా ఉన్నాయి ఇరుజట్లు. ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఎంతో కీలకం గా మారిపోయింది. నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇటీవలే టీమిండియా లోని కీలక ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడడంతో ఎంతో మంది యువ ఆటగాళ్లకు టీం ఇండియాలో ఆడే అవకాశం దక్కింది. ఐపీఎల్ లో అదరగొట్టిన ఎంతో మంది యువ ఆటగాళ్లు ఇక ఇటీవల ఓ అంతర్జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నారు. ఇలా స్థానం సంపాదించుకున్న వారిలో ఐపీఎల్ స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కాల్ కూడా ఒకరు.



 నిన్న జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్లో తన మొదటి టి20 మ్యాచ్ ఆడాడు దేవదత్ పడిక్కాల్. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 2000 సంవత్సరం తర్వాత పుట్టి ఇక భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్న మొట్టమొదటి క్రికెటర్గా దేవదత్ పడిక్కాల్ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా నిన్న జరిగిన టి20 మ్యాచ్ లో 25 బంతుల్లో 29 పరుగులు చేశాడు దేవదత్ పడిక్కాల్. కాగా ఈ యువ ఆటగాడు 2000 సంవత్సరంలో జూలై 17 వ తేదీన జన్మించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇక ఈ జట్టులో కీలక ఆటగాడిగా తనదైన శైలిలో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు దేవదత్ పడిక్కాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: