ప్రస్తుతం క్రికెట్లో ఎన్నో రకాల ఫార్మాట్లు ఉన్నాయి కానీ ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన ఫార్మాట్ ఏది అంటే అందరు టక్కున చెప్పే పేరు టి-20 ఫార్మాట్. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు సైతం టీ20 ఫార్మాట్ పై అంతగా ఆసక్తి చూపించలేదు. కానీ ఆ తర్వాత టి20 ఫార్మాట్ లో ఉన్న మజా ని అర్థం చేసుకొని ప్రస్తుతం అన్ని దేశాల క్రికెట్ జట్లు కూడా టి20 ఫార్మాట్ ఆడుతున్నాయి. సాధారణంగా టెస్ట్ ఫార్మాట్ అయితే మ్యాచ్ ఫలితం తేలడానికి నిరీక్షణ గా ఎదురు చూడాల్సి ఉంటుంది  అంతేకాదు ఇక బ్యాట్స్మెన్లు ఎంతో ఓపికగా గ్రీజులో తమ వికెట్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక వన్డే ఫార్మాట్ విషయానికొస్తే ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు ఇక పరుగులు చేయాల్సి ఉంటుంది.



 అదే టీ20 ఫార్మాట్ విషయానికి వస్తే తక్కువ సమయం తక్కువ బంతులు.. అందుకే ఒకసారి మైదానంలోకి దిగిన బ్యాట్స్మెన్ వచ్చిన ప్రతి బంతిని బౌండరీకి తరలించాలి అన్నిఅని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకవేళ బౌండరీకి తరలించకా పోయినా కనీసం బంతికి ఎక్కువ పరుగులు చేసేలా ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంతే కాదు అటు బౌలర్లు కూడా ప్రతి బంతికి వికెట్ పడగొట్టాలి అనే వ్యూహంతో ఎంతో పదునైన పంతులు విసురుతూ ఉంటాడు. ఇలా బంతి బ్యాట్ కి మధ్య టి20 ఫార్మాట్లో హోరాహోరీ యుద్ధమే జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఆటగాళ్లు రెచ్చిపోయి మరీ ఆడుతుంటారు. కేవలం మూడు గంటల వ్యవధిలోనే మ్యాచ్ ఫలితం కూడా తేలిపోతుంది.



 అంతేకాదు టి20 ఫార్మాట్లో ఎన్నో అద్భుతాలు కూడా జరిగిపోతూవుంటాయి. అయితే ముఖ్యంగా టీ-20 ఫార్మెట్లో బౌలర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మారుస్తూ ప్రత్యర్థుల వికెట్లు పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు t20 ఫార్మాట్ లో భారత ప్లేయర్లలో ఎవరు ఎక్కువ వికెట్లు తీశాడు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. యుజ్వేంద్ర చాహల్.. చూడటానికి మనిషి బక్కపలుచగా ఉంటాడు అతను వికెట్లు తీయడం ఏంటి అని అనుకుంటారు అతన్ని చూస్తే ఎవరైనా. కానీ తనదైన స్పిన్ బౌలింగ్ తో మాయ చేస్తూ ఇక అటు బ్యాట్స్మెన్లను తికమక పెడుతూ వికెట్లను పడగొడుతూ ఉంటాడు యుజ్వేంద్ర చాహల్. ఇప్పటివరకు యుజ్వేంద్ర చాహల్  టీ20ల్లో అరవై మూడు వికెట్లు తీసి టాప్ లో కొనసాగుతున్నారు. ఇక ఆ తర్వాత జస్ప్రిత్ బూమ్రా 59, రవిచంద్రన్ అశ్విన్ 52, భువనేశ్వర్ కుమార్ 50 పస్తుతం టాప్ లో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: