యూరప్ కు చెందిన సాన్ మారినో అనే చిన్నదేశం ఒలింపిక్స్ చరిత్ర పుటలకెక్కింది. జనాభా పరంగా పతకం గెలిచిన అతి చిన్న దేశంగా రికార్డుకెక్కింది. 33ఏళ్ల మహిళా షూటర్ అలెజాండ్రా పెరిలినే కాంస్యం సాధించి ఆ దేశానికే గర్వకారణంగా నిలిచింది. సాన్ మారినో చుట్టూ ఇటలీ ఉంటుంది. జనాభా కేవలం 34వేల మాత్రమే. 1960 రోమ్ ఒలింపిక్స్ నుంచే సాన్ మారినో విశ్వక్రీడలు ఆడుతోంది.

శాన్ మారినో అనే దేశం.. అపెనైనె పర్వతాలకు ఈశాన్య భాగంలో ఉంటుంది. ఇటాలియన్ ద్వీపకల్పంలో పొదిగి ఉంది. సాన్ మారినో విస్తీర్ణం విషయానికొస్తే కేవలం 61చదరపు కిలోమీటర్లు మాత్రమే. అయితే సాన్ మారినో చూడటానికి  అతిచిన్న దేశమే అయినా.. ధనిక దేశం. ముఖ్యంగా పరిశ్రమలు, టూరిజంపై ఆధారపడి ఉంటుంది ఈ దేశం. అందుకే అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉంటుంది. నిరుద్యోగం కూడా తక్కువే. ఎప్పుడూ మిగులు బడ్జెట్ తో.. ఆర్థికంగా బాగా ఎదిగిన కంట్రీ.

సాన్ మారినో ప్రజలు ఫుట్ బాల్ ను ఇష్టంగా ఆడతారు. అందుకే ఆ దేశంలో ఫుట్ బాల్ కు అత్యంత ప్రజాదరణ ఉంది. ఈ క్రీడలో ఫుట్ బాల్ టీమ్ ఆశించిన స్థాయిలో విజయాలు కూడా సొంతం చేసుకుంది. కానీ అంతర్జాతీయ స్థాయిలో మాత్రం రాణించలేకపోయింది. కానీ అలెజాండ్రా పెరిలినే మాత్రం లక్ష్యానికి గురిపెట్టి షూటింగ్ లో కాంస్యం సాధించింది. ఆ దేశ ప్రజలు గొప్పగా చెప్పుకునేలా చేసింది.

ఈ దేశంలో రవాణా వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందలేదు. బస్సులు కూడా పరిమితంగానే ఉంటాయి. శాన్ మారినో నుండి ఇటలీకి మాత్రమే బస్సులు తిరుగుతుంటాయి. అదీ తక్కువే. ఇక్కడి ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేయరు. ఈ దేశానికి మరో ఘనత కూడా ఉంది. సంగీతంలో శాన్ మారినో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడి సంగీతానికి ఎవరైనా దాసోహమవ్వాల్సిందే. ఈ దేశం మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.










మరింత సమాచారం తెలుసుకోండి: