టోక్యో ఒలంపిక్స్ ఇటీవలే ప్రారంభమైంది.. ఇక టోక్యో ఒలంపిక్స్ లోని అన్ని ఆటలు కూడా  క్రమక్రమంగా ముగుస్తున్నాయి. ఈ క్రమంలోనే దాదాపుగా అన్ని దేశాలు తమ పథకాల పరంపరను కొనసాగిస్తున్నాయి.  అయితే ఎప్పటిలాగానే భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో కూడా నిరాశే ఎదురవుతుంది.  దాదాపుగా అన్ని విభాగాలలో కూడా భారత్కు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు  కానీ అడుగడుగునా భారత్ కు నిరాశే ఎదురవుతుంది.  మొదట అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినప్పటికి ఆ తర్వాత మాత్రం నిరాశతో టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమిస్తారు ఎంతో మంది భారత క్రీడాకారులు. ఇప్పటివరకు వివిధ విభాగాల్లోని క్రీడాకారుడు ఇలాగే నిరాశ పరిచారు.



 ఓ వైపు కొన్ని దేశాలు పదుల సంఖ్యలో బంగారు పతకాలు, వెండి పతకాలు, కాంస్య పతకాలు ఎగరేసుకు పోతున్నాయి. అన్ని రకాల క్రీడా విభాగాల్లో కూడా అద్భుతంగా సత్తా చాటుతున్నాయి. కానీ భారత్ మాత్రం ఇప్పటివరకు కేవలం ఒక్కటంటే ఒక్కటే పథకాన్ని గెలిచింది అని చెప్పాలి. అది కూడా బంగారు పతకం కాదు కేవలం సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుంది భారత్. ఈసారి ఎంతో మంది క్రీడాకారులు భారత్కు పతకాలు తెస్తారు అని భావించినప్పటికీ చాలామంది నిరాశపరిచారు.  ఇక ఇప్పుడు భారత ప్రేక్షకుల అందరి ఆశలు కూడా ఒకే ఒక్క అథ్లెట్ పై ఉన్నాయి. ఆమె ఎవరో కాదు తెలుగు తేజం పీవీ సింధు.



 గతంలో జరిగిన ఒలంపిక్స్ లో ఇక అందరూ నిరాశపరుస్తున్న సమయంలో అద్భుతంగా రాణించిన పీవీ సింధు చివరికి కాంస్య పతకాన్ని సాధించి తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టింది   ఇక ఇప్పుడు టోక్యో ఒలంపిక్స్ లో కూడా సత్తా చాటుతూ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది పీవీ సింధు. ఇటీవల వరుస విజయాలతో సెమీఫైనల్కు చేరుకుంది. ఇటీవలే సెమీ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ తై జూ  (చైనీస్) క్రీడాకారిణితో తలపడనుంది. ఇక ఈ పోటీ ఎంతో టఫ్ మ్యాచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు వీరిద్దరి మధ్య 18 సార్లు పోటీ చేయగా పి.వి.సింధు 5 సార్లు మాత్రమే విజయం సాధించింది. మరోవైపు ఏడాదిలో 15 మ్యాచ్లు ఆడిన తై జు 12 మ్యాచ్ లలో విజయం సాధించింది  అయితే అటు చైనా క్రీడాకారిణి కూడా ఇప్పటివరకు ఒలింపిక్స్ లో పతకం సాధించలేదు. ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ ఎంతో టఫ్ మ్యాచ్ గా మారబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: