ప్రస్తుతం భారత క్రికెట్లో 3 ఫార్మాట్లకు కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి కెప్టెన్గా విరాట్ కోహ్లీ తప్పుకోబోతున్నాడు అనే వార్తలు వినిపించాయి. దీనిని బీసీసీఐ ఖండించింది. కానీ ఇటీవలే ఆ వార్తలే నిజం అయ్యాయి. స్వయంగా విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం సంచలనం గా మారిపోయింది. ప్రపంచకప్ తర్వాత టి20 కెప్టెన్సీని వదిలబోతున్నాను అంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలిపాడు విరాట్ కోహ్లీ. ఇక కోహ్లీ ప్రకటన అభిమానులందరికీ ఊహించని షాక్ ఇచ్చింది అని చెప్పాలి.



 గత కొన్ని రోజుల నుంచి పరిమిత ఓవర్ల  కెప్టెన్గా కోహ్లీ సక్సెస్ కాలేక పోతుండటం..  సారథ్యం నుండి తప్పుకోవాలని డిమాండ్స్ రావడంతోనే కోహ్లీ ఇలా చేసాడా లేదా ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై కూడా చర్చ నడుస్తుంది. అదే సమయంలో ఇక కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుంటే టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ ఎవరు కాబోతున్నారు అన్నదానిపై కూడా ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  టీమిండియా భవిష్యత్తు కెప్టెన్గా కేఎల్ రాహుల్ ని ప్రోత్సహించాలి అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.



 కేఎల్ రాహుల్ లో ఎంతో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అంటూ సునీల్ గవాస్కర్ తెలిపాడు. టీమిండియా ఒక కొత్త కెప్టెన్ను తయారు చేయాలి అనుకుంటే కేఎల్ రాహుల్ పై దృష్టి పెడితే ఎంతో మంచిది అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ సహా 50 ఓవర్ల క్రికెట్లో కూడా కేఎల్ రాహుల్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని అయితే అతన్ని వైస్ కెప్టెన్గా కూడా నియమించవచ్చు అంటూ తెలిపాడు.  ఇకపోతే కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: