ఐపీఎల్ 14 సీజన్ రెండవ అంకానికి మరొక రోజు మాత్రమే ఉంది. కరోనా కారణంగా ఇండియాలో ఐపీఎల్ 29 మ్యాచ్ లు మాత్రమే జరిగాయి. వాయిదా వేసే సమయానికి ఇంకా ప్లే ఆఫ్స్ తో కలుపుకుంటే 31 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. కాగా ఐపిఎల్ రెండవ పార్ట్ ఆదివారం నుండి యూఏఈ మరియు ఒమన్ వేదికలుగా జరగనుంది. మొదటి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ముంబై మరియు చెన్నై సూపర్ కింగ్స్ తో మొదలు కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ లో ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు మరియు ముంబై జట్లు పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాలలో ఉన్నాయి.

అయితే ఇప్పటికే ఐపీఎల్ గెలిచే జట్లు ఇవే అంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది ఇలా ఉంటే నిన్ననే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రెండవ పార్ట్ కి కూడా రిషబ్ పంత్ నే ఎంచుకున్నారు. దీనితో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ కు అందుబాటులో ఉన్నా కూడా ఎందుకు రిషబ్ ను ఎన్నుకున్నారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రచారంలో ఉన్న ప్రకారం శ్రేయాస్ గత ఆరు నెలలుగా గాయం కారణంగా ఐపీఎల్ 14 సీజన్ కు దూరమైన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు రికవర్ అయి జరగబోయే మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో ఉండనున్నాడు.

కానీ ఒక్కసారిగా గాయం నుండి కోలుకున్న శ్రేయస్ కు కెప్టెన్సీ బాధ్యత ఇవ్వడం మంచిది కాదని, ఇది అతని ఆటపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా శ్రేయస్ ను ఫ్రీగా ఆడనిస్తే జట్టుకు ఉపయోగపడుతుంది. అలాగే మెంటల్ గా స్వేచ్ఛగా ఆశగలడు అని అంటున్నారు. పైగా రిషబ్ కూడా సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా రాణిస్తుండడంతో ప్రయోగం చేయడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో విమర్శకుల నోటికి తాళం పడ్డట్లయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: