పాకిస్తాన్ తో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డుకు గ‌ట్టి షాక్ త‌గిలింది. మ‌రి కాసేప‌ట్లో పాకిస్థాన్ న్యూజిలాండ్ మ‌ధ్య వ‌న్డె మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండ‌గా అనూహ్యంగా న్యూజీలాండ్ క్రికెట్ టీం త‌మ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద‌ద్ఉ చేసుకుంది. దీంతో ఇప్పుడిప్పుడే అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జ‌రుగున్న నేప‌థ్యంలో భ‌విష్య‌త్‌పై ఆశ‌తో ఉన్న పాక్ క్రికెట్ బోర్డుకు గ‌ట్టి ఎదురు దెబ్బ తగిలిన‌ట్ట‌యింది. పాకిస్థాన్ ప‌ర్య‌ట‌న‌ను భ‌ద్ర‌త కార‌ణాల‌తో న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు ర‌ద్దు చేసింది. ఒక్క మ్యాచ్ కూడా జ‌ర‌గ‌కుండా తిరిగి ప‌య‌నం కానుంది. 18 ఏళ్ల త‌రువాత పాకిస్తాన్ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన న్యూజీలాండ్ క్రికెట్ టీమ్ మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందే ఈ అనూహ్య నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్ర‌హాన్ని వెల్ల‌గ‌క్కింది.


   పాక్‌తో కివిస్ మూడు వ‌న్డేలు, అయిదు టీ20లు ఆడాల్సి ఉంది. దేశానికి అంత‌ర్జాతీయ టీమ్ ల‌ను ర‌ప్పించ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్న పాక్ కు న్యూజీలాండ్ నిష్క‌మ్ర‌ణతో భ‌విష్య‌త్తు పై చాలా ప్ర‌భావం ప‌డ‌నుంది.  శుక్ర‌వారం రావ‌ల్సిండిలో పాక్ కివిల మ‌ధ్య తొలి వన్డే నిర్వ‌హ‌ణ‌కు అంతా సిద్దం చేశారు. మ్యాచ్ స‌మయం ద‌గ్గ‌ర ప‌డుతున్నా ప్లేయ‌ర్లు హోట‌ల్ గ‌దుల్లోనే ఉండిపోయారు. వీక్ష‌కుల‌ను లోప‌లికి రానివ్వ‌లేదు. ఈ క్ర‌మంలో న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి డేవిడ్ వైట్ భ‌ద్ర‌త కార‌ణాల‌తో ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి బాంబ్ పేల్చారు.


       ఈ నిర్ణ‌యం పీసీబీ పెద్ద దెబ్బె కానీ, మాకు ఆట‌గాళ్ల భ‌ద్ర‌త ముఖ్యం, జ‌ట్టు భ‌ద్ర‌త‌కు ముప్పు ఉంద‌ని న్యూజీలాండ్ ప్ర‌భుత్వం చెప్ప‌డంతో పాటు పాక్‌లో ఉన్న న్యూజీలాండ్ క్రికెట్ భ‌ద్ర‌తా అధికారుల సూచ‌న‌ల మేర‌కు ఈ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకుంటున్నామ‌ని డేవిడ్ వైట్ వెల్ల‌డించారు. దీంతో పీసీబీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. న్యూజీలాండ్ ఆట‌గాళ్ల‌కు ఎలాంటి భ‌ద్ర‌తా ముప్పు లేద‌ని, న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు పీసీబీ కొత్త చైర్మ‌న్ ర‌మీజ్ రాజా అన్నారు. స్వ‌యంగా పాక్ ప్ర‌ధాని ఇమ్రాయింది ఖాన్ న్యూజీలాండ్ ప్ర‌ధానితో మాట్లాడిన ఫ‌లితం లేకుండా పోయింది.

     
    న్యూజీలాండ్ నిర్ణ‌యంతో పాకిస్థాన్ క్రికెట్ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థకంగా మారింది. గ‌తంలో పాక్ ప‌ర్య‌ట‌నకు వ‌చ్చిన శ్రీ‌లంక జ‌ట్టుపై దాడి జ‌ర‌గ‌డంతో పాక్ లో అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వ‌హించ‌లేదు. ఇప్పుడిప్పుడే అంర్జాతీయ జ‌ట్లు పాక్‌లో ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న క్ర‌మంలో మ‌ళ్లీ పాక్  క్రికెట్ బోర్డుకు క‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఈ ప్ర‌భావంతో పాక్ ప‌ర్య‌ట‌న‌కు రావాల‌నుకుంటున్న జ‌ట్లు వెన‌క‌డు వేసే అవ‌కాశం ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: