పాకిస్థాన్ దేశం అంటేనే ఉగ్ర‌వాదం అనే పోలిక అనేది చాలా రోజుల నుంచే ఉంది. దీన్ని ప్ర‌పంచం లోని చాలా దేశాలు కూడా అంగీక‌రించాయి. దీనికి గ‌ల కార‌ణం పాకిస్థాన్ దేశంలో ఉగ్ర‌వాదులు ఉంచుకుని వారిని పోషించ‌డ‌మే. దీని పై యూఎన్ ఓ తో పాటు దాదాపు అన్ని దేశాలు కూడా హెచ్చ‌రించాయి. ఉగ్ర‌వాదులను పాక్ నుంచి తెలిగిస్తేనే సంబంధ‌లు ఉంటాయ‌ని భార‌త్ కూడా తెల్చి చెప్పింది. అయినా పాక్ ఉగ్ర‌వాదుల విష‌యంలో నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉంది. దానికి ప‌ర్యావ‌స‌నంగా ఇప్పుడు ఎన్నో అవ‌మానాలు భ‌రించాల్సి వ‌స్తుంది. ఇప్ప‌టి కే చాలా దేశాలు పాకిస్థానక్ ఎలాంటి ఆర్థిక సాయం చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నాయి. అంతే కాకుండా ఆ దేశంతో క్రికెట్ ఆడ కూడ‌ద‌ని కూడా నిర్ణ‌యం తీసుకున్నాయి. భార‌త్ కూడా పాక్ తో ఎలాంటి ద్వైపాక్షిక మ్యాచ్ లు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేసింది.


తాజా గా న్యూజీలాండ్ కూడా పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడ‌లేమ‌ని తెల్చి చెప్పింది. పాక్ లో భ‌ద్ర‌తా ప‌రంగా ఇబ్బందులు ఉన్నాయ‌ని అందుకు తాము ఆడ‌లేమ‌ని చెప్పింది. అంతే కాకుండా పాక్ నుంచి తిరిగు ప్ర‌యాణానికి సిద్ద‌మైంది. పాక్ అధ్య‌క్షుడు ఇమ్రాన్ ఖాన్ న్యూజిలాండ్ ప్రాధాని తో చ‌ర్చించినా లాభం లేక పోయింది. అయితే న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణ‌యం ఇంగ్లాండ్ పై ప‌డే అవ‌కాశం ఉంది. వ‌చ్చే నెల‌లో పాకిస్థాన్ ఇంగ్లాండ్ దేశాల మ‌ధ్య ద్వై పాక్షిక మ్యాచ్ లు ఉన్నాయి. అయితే పాక్ లో భ‌ద్ర‌తా ప‌ర‌మైనా ఇబ్బందులు ఉన్న‌యానే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇంగ్లాండ్ ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. తాము కూడా ఈ సిరిస్ ను ర‌ద్దు చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటున్న‌ట్టు స‌మాచారం. దీనిపై ఇంగ్లాండ్ బోర్డు స్పంధిస్తూ 48 గంట‌ల్లో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించ‌డం ప‌లు అనుమానాల‌కు తావు ఇస్తుంది.



గ‌తంలోనే శ్రీలంక ఆట‌గాళ్ల పై ఉగ్ర‌వాదులు దాడి చేయ‌డంతో నే పాకిస్థాన్ క్రికెట్ దూరం కావాల్సి వ‌స్తుంద‌ని అనుకున్నారు. కానీ  కొన్ని దేశాలు ధైర్యం చేసి ఆడ‌టంతో పాక్ క్రికెట్ బ‌తికింది. కానీ నేడు న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణ‌యంతో పాక్ క్రికెట్ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థకంగా మారింది. 2009 లో లాహొర్ న‌డిబొడ్డున శ్రీలంక ఆట‌గాళ్ల ల‌పై ఉగ్ర‌వాదులు తూపాకుల‌తో చేసినా దాడి ఇంకా ప్ర‌పంచం మ‌ర్చి పోలేదు. మ‌ళ్లి అలాంటి దాడుల‌ను ఎదుర్కొవ డానికి ఏ దేశ ఆట‌గాళ్లు సిద్దంగా లేర‌ని తెలుస్తుంది. ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ భ‌విష్య‌త్తు ఇంగ్లాండ్ పైనే ఆధారా ప‌డి ఉంది. ఇంగ్లాండ్ కూడా ఈ సీరిస్ ను ర‌ద్దు చేసుకుంటే పాక్ త‌మ దేశ క్రికెట్ పై ఆశ‌లు వ‌దులు కోవాల్సిందే.












మరింత సమాచారం తెలుసుకోండి: