అందరూ ఎదురు చూస్తూన్న పొట్టి క్రికెట్.. టోర్నీ సందడి మొదలైంది. ఐపీఎల్ 2021 సీజన్ టు నేటి నుంచి ప్రారంభం కానుంది.  ఇవాల్టి నుంచి యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక నేటి రోజు ఊ ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగనుంది. ఇక కరోనా నేపథ్యంలో గత ఏడాది కూడా యూఏఈ లోని ఐపీఎల్ నిర్వహించిన సంగతి మనకు విధితమే. ఇందులో భాగం గానే కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది కూడా.. యూఏఈ లోనే ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. యూఏఈ లోని దుబాయ్, అబుదాబి  మరియు షార్జా క్రికెట్ స్టేడియం లలో ఐపీఎల్ 2021 జరగనుంది. 

ఐపీఎల్ రెండో సీజన్ లో భాగంగా మొత్తం 27 రోజుల్లో ఏకంగా 31 ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇక ఓవర్ 8వ తారీకున లీగ్ స్టేజిలో చిట్టచివరి మ్యాచ్ జరగనుంది. ఇక ఆ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తో తలపడనుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అలాగే మొదటి క్వాలిఫైయర్ -1 మ్యాచ్ అక్టోబర్ పదో తారీఖున దుబాయ్ వేదికగా జరుగనుంది. ఎలిమినేటర్ మరియు క్వాలిఫైయర్ -2  మ్యాచులు అక్టోబర్ 11 వ తారీకు మరియు అక్టోబర్ 13వ తారీఖున షార్జా వేదికగా జరగనున్నాయి. ఇక ఇవాళ దుబాయ్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు  ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30 కు ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కావడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్ పైనే ఉంది.

ఇక బలాబలాల విషయానికి వస్తే... ఇటు చెన్నై సూపర్ కింగ్స్ మరియు అటు ముంబై ఇండియన్స్ చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కాస్త అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.  ఏదైతేనేం ఇవాళ సాయంత్రంలోగా ఏ జట్టు విజయం సాధిస్తుందో తేలనుంది.  ప్రస్తుతం 2021 పాయింట్ల పట్టిక లో... టాప్ పొజిషన్ లో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. 12 పాయింట్లు సాధించి డిల్లీ అగ్రస్థానంలో ఉంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్ ఢిల్లీ తర్వాతి స్థానాన్ని దక్కించుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: