ఐపీఎల్ 2021  కరోనా మహమ్మారి కారణంగా అర్థాంతరంగా వాయిదా పడిన సంగతి మనకు విదితమే. అయితే ఈ అర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 రెండవ భాగం... నీటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. దీంతో క్రికెట్ ఫాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఎన్నో కోట్ల వ్యాపారం నేపథ్యంలో ఈ ఐపీఎల్ జరగనుంది. కోట్లు ఖర్చు చేసి ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నాయి.. ఫ్రాంచైజీలు. అయితే.. ఈ ఐపీఎల్ లో ఏ ఆటగాడు ఎక్కువ సంపాదిస్తున్నా డో తెలుసుకున్నాం.

1. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని కి ఏకంగా 15 కోట్లు ఇస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పలుమార్లు ఫైనల్లో నిలిపాడు మహేంద్రసింగ్ ధోని. అంతేకాదు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ చాలా ట్రోఫీలను గెలుపొందింది. ఈసారి కూడా మంచి పోటీని ఇస్తోంది చెన్నై సూపర్ కింగ్స్.
2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ సీజన్ లో ఏకంగా 17 కోట్లు ఇస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... ఐపీఎల్ టోర్నీ ని గెలవలేకపోయింది. చాలాసార్లు ప్లే ఆఫ్ కు చేరుకున్న నిరాశే మిగిలింది.
3. వెస్టిండీస్ క్రికెటర్ మరియు విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ ఐ పీ ఎల్ లో రెండు కోట్ల వేతనం చెల్లిస్తోంది పంజాబ్ ఫ్రాంచైజీ. ఈ ఏడాది పంజాబ్ టీం కు క్రిస్ గేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
3. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కు ఏకంగా రూ. 3.2 మొత్తం చెల్లిస్తోంది కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు.

4. అలాగే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు రూ. 2.2 ఓట్లు చెల్లిస్తున్నారు. స్టీవ్ స్మిత్ గతంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు.

5 ఇక ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ కు ఏకంగా 15 కోట్లు ఇస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించి ముంబై ఇండియన్స్ కు ఎన్నో టైటిల్స్ సాధించిపెట్టాడు.
7. విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎబి డివిలియర్స్ కు ఏకంగా 11 కోట్లను ఇస్తున్నారు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఏబీ డివిలియర్స్.
8 ఇక స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు రూ.5.2 ఓట్లను ఇస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

9. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు రూ. 12.50 ఓట్లు చెల్లిస్తోంది సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు డేవిడ్ వార్నర్.
10. ఇక న్యూజిలాండ్ కెప్టెన్  కేన్ విలియమ్సన్ కు ఏకంగా మూడు కోట్లు చెల్లిస్తోంది సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ.

మరింత సమాచారం తెలుసుకోండి: