రోహిత శ‌ర్మ పేరు చెప్ప‌గానే రికార్డు ల‌న్నీ హ‌డ‌లెత్తుతాయి. ఇప్ప‌టికే రోహిత్ శ‌ర్మ పేరిట అనేక రికార్డు లున్నాయి. ఇప్పుడు రోహిత్ శ‌ర్మ‌ను మ‌రో అరుదైన రికార్టు ఉరిస్తుంది. మ‌రో మూడు సిక్స్ లు కొడితే టీ ట్వంటి ల‌లో అత్య‌ధిక సిక్స్ లు కోట్టిన ఆట‌గాడిగా రికార్డు కు ఎక్క‌నున్నాడు. ఈ అరుదైనా రికార్డు అందుకోవ‌డానికి ఇప్పుడు రోహిత్ శ‌ర్మ సిద్దంగా ఉన్నాడు. ఈ ఫీట్ ను ఆదివారం నుంచి జ‌రిగ‌బోయే ఐపీఎల్ రెండోద‌శ మ్యాచ్ ల‌లో అందుకోనున్నాడు. కాగ ఈ ఐపీఎల్ ఫేజ్ 2 లో మొద‌టి మ్యాచ్ రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో ని ముంబాయ్ ఇండియాన్స్ కు అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ దోని నాయ‌కత్వంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య ఉండ‌నుంది.రోహిత్ శ‌ర్మ త‌న రికార్డును చెన్నై తో జ‌రిగ బోయే మ్యాచ్ లోనే సాధిస్తాడ‌ని రోహిత్ అభిమానులు జోస్యం చెబుతున్నారు. కాగ రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు 350 టీ ట్వంటీ మ్యాచ్ ల‌ను ఆడాడు. ఈ మ్యాచ్ ల‌లో 397 సిక్స్ ర్ల‌ను బాదాడు. మ‌రో మూడు సిక్స్ లు కొడితే 400 సిక్స్ ల మార్క ను అందుకొనున్నాడు. రోహిత్ త‌ర్వాత ఎక్కువ సిక్స్ లు కొట్టిన వారి జాబితా లో సురేష్ రైనా ఉన్నాడు. రైనా ఇప్ప‌టి వ‌ర‌కు 331 టీ ట్వంటి మ్యాచ్ లు ఆడి 324 సిక్స్ ల‌ను కొట్టాడు. రైనా త‌ర్వాత జాబితాలో విరాట్ కోహ్లి ఉన్నాడు. కోహ్లి ఇప్ప‌టి వ‌ర‌కు 311 టీ 20 మ్యాచ్ లు ఆడి 315 సిక్స్ ల‌ను కొట్టాడు. విరాట్ కోహ్లి త‌ర్వాత ధోని ఉన్నాడు. ధోని 338 మ్యాచ్ ల‌లో 303 సిక్స్ ల‌ను బాదాడు.


ఇదీలా ఉండ‌గా రోహిత్ శ‌ర్మ ఖాత లో ఇప్ప‌టి కే చాలా రికార్డు లున్నాయి. వ‌న్డే ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్ ల‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ ఉన్న ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ‌నే. ఒకే ఇన్నింగ్స్ లో 264 ప‌రుగులు సాధించి రికార్డు సృష్టించారు. అలాగే వ‌న్డే ఇంట‌ర్నేష‌న‌ల్ ల‌లో ఎక్కువ సార్లు 200 ప‌రుగులు చేసిన ఆట‌గాడు కూడా రోహిత్ శ‌ర్మ నే కావ‌డం విశేషం. అలాగే ఒకే సిరిస్ లో ఎకంగా ఐదు సెంచ‌రీ లు సాధించిన రికార్డు కూడా రోహిత్ శ‌ర్మ పేరునే ఉంది. ఇలా రోహిత్ శ‌ర్మ పై అనేక రికార్డు లు ఉన్నాయి. వీటి తో పాటు మ‌రో మూడు సిక్స్ లు కొడితే 400 సిక్స్ లు బాదిన ఆట‌గాడిగా రికార్డు కు ఎక్కే అవ‌కాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: