సరిగ్గా 14 ఏళ్ల క్రితం.. 2007 సంవత్సరంలో.. ఇదే రోజు.. ఎవరూ ఊహించని విధ్వంసం.. క్రికెట్ ప్రపంచం ఎరుగని ప్రభంజనం.. కనీవినీ ఎరుగని పర్ఫామెన్స్..  ఆ పర్ఫామెన్స్ చూసిన తర్వాత ప్రేక్షకులకు మాటలే రాలేదు కేవలం రెండు చేతులతో చప్పట్లు తప్ప.  అలాంటి ఒక అద్భుతమైన సంఘటనను ఇప్పుడు ప్రేక్షకులు మరోసారి నెమరు వేసుకుంటున్నారు.  ఆ విధ్వంసాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.  అప్పటి గెలుపును మరోసారి క్రికెట్ ప్రేక్షకులందరూ గుర్తు చేసుకుంటూ ఊహ లోకం లోకి వెళ్లి పోతున్నారు. ఇంతకీ ఆ విధ్వంసం ఏంటి అని అనుకుంటున్నారు కదా.. 2007 సంవత్సరంలో సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే రోజున టి20 ప్రపంచకప్ లో అప్పట్లో భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న యువరాజ్ సింగ్ సృష్టించిన విధ్వంసం ఎవరూ మర్చిపోలేరు. ఏకంగా ఆరు బంతుల్లో కూడా ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు యువరాజ్ సింగ్. ఇలా యువరాజ్ సింగ్ మైదానంలో రెచ్చిపోయి ఆడుతూ ఉంటే చూస్తున్న క్రికెట్ ప్రేక్షకులందరిలో ఎంతో ఉత్కంఠ. అసలు మాటలే రాలేదు కేవలం చప్పట్లు తప్ప.
 టి 20 ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ భారత్ జట్లు పోటీ పడ్డాయి.. ఇక అప్పుడు భారత జట్టులో కీలక ఆటగాడిగా ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు యువరాజ్ సింగ్. ఇక ఈ మ్యాచ్లో విధ్వంసం సృష్టించాడు ఇంగ్లాండ్ జట్టులో కీలక బౌలర్ గా ఉన్నాడు స్టువర్ట్ బ్రాడ్ అప్పటి వరకు పలు వికెట్లు తీసి మంచి జోష్ మీద ఉన్నాడు  ఇక అలాంటి బౌలర్ ను ఒక ఆట ఆడుకున్నాడు 19వ ఓవర్లో ఆరు బంతుల ఆరు సిక్సర్లు బాదాడు ఇక ఈ మ్యాచ్లో భారత జట్టు 218 పరుగులు చేసింది.ఇక చివరికి 18 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. 16 బంతుల్లో మూడు ఫోర్లు 7 సిక్సర్లు బాది విజృంభించిన యువరాజ్ సింగ్ ఇక ఆ మ్యాచ్ లైవ్ మ్యాచ్ ది మ్యాచ్గా అవార్డును దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: