ప్రపంచంలో అన్ని క్రీడల కంటే... క్రికెట్ మ్యాచ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎలాంటి ఇతర  మ్యాచ్ లు   జరిగినా... చాలా మంది  ప్రాధాన్యత ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్ లకు ఉన్న ఫ్యాన్స్ మరెవరికీ లేరు. ఈ క్రికెట్ చరిత్రలో టెస్టులు, వన్ డే లు మరియు ప్రస్తుతం టి20 లు కూడా వచ్చేశాయి. క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఎన్నో రకాల రూల్స్  వస్తున్నాయి. అలాగే  ఐపీఎల్ లాంటి రకరకాల టోర్నీ లు కూడా... వస్తున్నాయి. క్రికెట్ అనేది మగవారే కాకుండా మహిళలు కూడా ఎంతో బ్రహ్మాండంగా ఆడుతున్నారు. 

అయితే ఇది ఇలా ఉండగా..  మహిళా క్రీడాకారులు మరియు పురుషులు సమానంగా ఉండాలనే నేపథ్యంలో ఆస్ట్రేలియా దేశానికి చెందిన మేరిల బోన్  క్రికెట్ క్లబ్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న క్రికెట్ చట్టాలకు భిన్నంగా కీలక నిర్ణయం తీసుకుంది మేరిల క్రికెట్ క్లబ్. క్రికెట్ చరిత్రలో పురుషులు మరియు మహిళలు అందరూ సమానమేనని... అందుకే ఇక నుంచి... బ్యాటింగ్ చేసేవారిని బ్యాటర్స్ అనాలని అని స్పష్టం చేసింది. ఒకరు బ్యాటింగ్ చేస్తే... "బ్యాటర్ " అని... ఒకరి కంటే ఎక్కువమంది బ్యాటింగ్ చేస్తే "బ్యాటర్స్ " అనాలని అని స్పష్టం చేసింది మేరీల క్రికెట్ క్లబ్. 

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి క్రికెటర్లను... బ్యాటింగ్ చేసేటప్పుడు.. బ్యాట్స్ మెన్ లేదా బ్యాట్స్ మెన్స్   అనే పదాలను వాడకూడదని... మేరీల బోన్ క్రికెట్ క్లబ్ స్పష్టం చేసింది. ఎవరైనా ఈ నిబంధనలను... పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మహిళా క్రికెటర్ లను సోదర భావంతో చూడాలని... క్రికెటర్లలో లింగ భేదం ఉండకూడదని నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది మేరీల బొన్ క్రికెట్ క్లబ్. ఇక  మేరీల బొన్ క్రికెట్ క్లబ్.. తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: