ప్రస్తుతం టీమిండియా జట్టులో కీలక స్పీన్నర్గా కొనసాగుతూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక స్పిన్ బౌలింగ్ లో తనకు తిరుగులేదు అని నిరూపిస్తూ భారత జట్టుకు విజయం అందించడంలో ఎప్పుడూ కీలక పాత్ర వహించాడు. సాధారణంగా స్పిన్ బౌలర్లకు ఎక్కువగా బౌలింగ్ ఇవ్వడానికి  ఇష్ట పడరు జట్టు కెప్టెన్ లు.. కానీ అశ్విన్ లాంటి స్పిన్ బౌలర్ లకు మాత్రం కీలక సమయంలో బంతి అప్పజెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే తన బౌలింగ్ యాక్షన్ తో తనదైన స్పిన్ బౌలింగ్ తో ఎప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటాడు రవిచంద్రన్ అశ్విన్. భారత జట్టు లోనే కాదు అటు ఐపీఎల్ లో కూడా రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు.



 ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూనే ఉంటాడు. అయితే ఇటీవలే ఐపీఎల్ రెండవ దశలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడింది. ఇక ఈ మ్యాచ్లో  రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బౌలింగ్ డిఫరెంట్ గా అనిపించింది. స్పిన్ బౌలింగ్ వేసేటప్పుడు వివిధ వేరియేషన్స్ చూపించాడు రవిచంద్రన్ అశ్విన్  ఇదే విషయంపై అటు భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ఒక క్రీడా ఛానల్తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.


 రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు ప్రపంచంలోనే మేటి ఆఫ్ స్పిన్నర్.. అలాంటి ఆటగాడు ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేదు అంటూ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు. అశ్విన్ తొలుత ఆఫ్ స్పిన్నర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అశ్విన్ బౌలింగ్ చేసేటప్పటికి ప్రత్యర్థి జట్టు కీలకమైన వికెట్లను కోల్పోయింది. అలాంటి సమయంలో తన సహజసిద్ధమైన బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే అతని బౌలింగ్లో సిక్స్ కొట్టక ముందే ఆఫ్ స్పిన్ వేసి ఉంటే బాగుండేది అంటూ చెప్పుకొచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగులో ఎన్ని వైవిద్యాలు ఉన్నప్పటికీ అతను మాత్రం ఒక ఆఫ్ స్పిన్నరే అంటూ గౌతం గంభీర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: