ఐపీఎల్ 2021 కు చాలా అవ‌రోధాలు ఎదురు అవుతున్నాయి. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ వ్యాప్తి వ‌ల్ల ఈ సిజ‌న్ ను ఒక సారి మ‌ధ్య లోనే అపేశారు. చాలా రోజుల త‌ర్వాత దుబాయ్ వేదిక‌న సెంక‌డ్ ఫెజ్ అంటు స్టార్ట్ చేశారు. అయితే ఈ రెండో విడుత ఐపీఎల్ మ‌రో వివాదం లో చిక్కుకున్న‌ట్టు క‌నిపిస్తుంది. మంగ‌ళ‌వారం జ‌రిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ అరోప‌ణ ల‌కు బ‌లం చేకురేలా కొన్ని సంఘ‌ట‌న లు కూడా చోటు చేసుకున్నాయ‌ని ప‌లువురు అంటున్నారు.



అయితే ఈ మ్యాచ్ కు కొన్ని గంట‌ల ముందు పంజాబ్ కింగ్స్ ఆట‌గాడు దీప‌క్ హుడా సోష‌ల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ లో దీప‌క్ హుడా ఒక ఫోటో ను ట్యాగ్ చేశాడు. ఈ ఫోటో నే అస‌లు వివాదానికి కార‌ణం అయింది. దీప‌క్ హుడా సోష‌ల్ మీడియాలో హెల్మెట్ పెట్టుకుంటున్న ఒక ఫోటో ను పెట్టాడు. అలాగే ఆ ఫోటో కిందా ఇదిగో వ‌స్తున్నాం అని వ్యాఖ్య కూడా జోడించాడు. అయితే బీసీసీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏ క్రిడా కారుడు కూడా టీం ను ప్ర‌క‌టించ‌క ముందు బాహ్య ప్ర‌పంచానికి తాను టీం లో ఉన్న‌ట్టు ఎలాంటి సంకేతాలు ఇవ్వ‌కూడ‌దు. అలా ఇస్తే ఆ అట‌గాడు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్ప‌డిన‌ట్టు భావిస్తారు. అయితే ఈ అనుమానాల‌ను బ‌ల ప‌రుస్తూ ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. అంతే కాకుండా దీప‌క్ హుడ కూడా అశించిన స్థాయిలో రాణించ‌లేడు.



దీంతో ఈ మ్యాచ్‌లో ఫిక్సింగ్ కు దీపక్ హుడా పాల్ప‌డ్డాడ‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. కాగ ఇప్ప‌టికే బీసీసీఐ అవినీతి నిరోధ‌క విభాగం కూడా ఈ పోస్ట్ పై దృష్టి సారించింది. ఇదీల ఉండ‌గా ఐపీఎల్ లో గ‌తంలో కూడా ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఐపీఎల్ 2020 లో కూడా ఫ‌క్సింగ్ వార్తలు వ‌చ్చాయి. స్వ‌యంగా ఒక ఆట‌గాడే ఫిక్సింగ్ సంబంధించిన వి చెప్పాడు. త‌న‌ను కొంత మంది బూకీలు క‌లిశార‌ని.. ఫిక్సింగ్ చేయ‌మ‌ని ఫోర్స్ చేశార‌ని ఆ అట‌గాడు చెప్పాడు. దీనిపై అప్ప‌ట్లో బీసీసీఐ సిరియ‌స్ తీసుకుని విచార‌ణ చేసింది. అలాగే 2013 లోనే శ్రీశాంత్ ఫిక్సింగ్ కు పాల్ప‌డితే బీసీసీఐ తీవ్రంగా స్పంధించింది. ఏకంగా జీవిత కాలం నిషేధం విధించింది. త‌ర్వాత కోర్టు నిషేదాన్ని ఎత్తివేసింది. కాగ ఇప్పుడు వ‌చ్చినా ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తెలితే బీసీసీఐ ఏ విధంగా స్పంధిస్తుందో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: