క్రికెట్ బోర్డుల విషయాలలో దేశ ప్రభుత్వాల... జోక్యం అస్సలు ఉండకూడదని ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసిన సంగతి ఇ మనకు తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ సర్కార్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఐసీసీ. ఇక నెలరోజుల కింద ఆఫ్ఘనిస్తాన్ సర్కార్ ను లొంగ తీసుకొని... ఆ దేశాన్ని దౌర్జన్యంగా... స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు. అంతేకాదు... అధికారం చేపట్టిన తాలిబన్లు... ఆఫ్ఘనిస్తాన్ దేశంలో  ప్రజలను అష్టకష్టాలు పెడుతున్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. 

ఇది ఇలా ఉండగా మొన్నటి వరకు ఉన్నా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిని కూడా మార్చేసింది ఈ తాలిబన్ స ర్కార్. అధ్యక్షుడిని మార్చేసి తమకను కూలంగా ఉండేటువంటి మరో వ్యక్తిని... నియామకం చేసింది తాలిబన్ సర్కార్. అక్కడితో ఆగిందా అంటే అదీ లేదు... ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మహిళలు క్రికెట్ ఆడకుండా నిషేధాజ్ఞలు తాలిబాన్ సర్కార్.  ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుని తాలిబన్ల సర్కా ర్. టి20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ దేశ జాతీయ జెండా కు బదులుగా... తమ జెండాను ఎగురవేయాలని... ఆలోచనలో ఉంది తాలిబన్ సర్కార్.

త్వరలోనే ఈ డిమాండ్ను కూడా తెరపైకి తీసుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు వార్నింగ్ ఇచ్చింది. నిజంగా తాలిబన్ సర్కార్ అలాంటి డిమాండ్ పెడితే ఆఫ్ఘనిస్తాన్ జట్టును... టోర్నీ నుంచి పూర్తిగా బహిష్కరిస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చింది ఐసీసీ. టి20 ప్రపంచ కప్ లో  ఆడాలనుకున్నా ప్రతి జట్టు తమ నిబంధనలు పాటించాలని.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకు చెప్పింది ఐసిసి. ఇది ఆఫ్ఘానిస్థాన్ టీం ఐసీసీ ప్రపంచ కప్ లో ఆడుతుందా ? లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

icc