రన్ మెషిన్ గా పేరున్న టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి ఫాంలోకి వచ్చినట్లు కనిపిస్తోంది. టి20 వరల్డ్ కప్ కు సరిగ్గా నెల రోజులు కూడా ఆగడు లేదు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ ఫాంపై అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాటింగ్లో వరుసగా విఫలమవుతున్న విరాట్.. పట్టుమని 10 పరుగులు కూడా చేసేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాజాగా జరిగిన ఇంగ్లాండ్ టూర్ లో కోహ్లీ బ్యాటింగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. నాలుగు టెస్టులు ఆడిన కోహ్లీ కనీసం ఒకటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అదే సమయంలో ఒకే రకమైన బంతులకు ఐదు సార్లు అవుట్ అవ్వడం విమర్శకుల నోటికి పని చెప్పినట్టు ఉంది. విమర్శలకు చెక్ పెట్టాలా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించాడు కూడా.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కోహ్లీ తిరిగి ఫాంలోకి వచ్చినట్లు కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో దేవ్ దత్ పడిక్కల్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ ప్రత్యర్థి బౌలర్లకు పై మునుపటి ఫామ్ కొనసాగించాడు. కేవలం 41 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్సర్ తో 53 నుంచి చేసి తన బ్యాట్ లో పవర్ తగ్గలేదని నిరూపించాడు. టీమిండియాకు టెస్ట్, వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ ఈ మధ్యకాలంలో బ్యాటింగ్లో వరుసగా విఫలమవుతున్నాడు. క్రికెట్ ప్రేమికులు నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో టి20 కెప్టెన్సీ నుంచి వరల్డ్ కప్ తర్వాత తప్పుకుంటున్నట్లు ఇటీవలే విరాట్ ప్రకటించాడు. తనపై ఒత్తిడి తగ్గించుకునేందుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పు ఉంటున్నామని.. ఇదే విషయాన్ని టీమిండియా కోచ్ రవి శాస్త్రి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తో చర్చించినట్లు కూడా కోహ్లీ వెల్లడించాడు. వరల్డ్ కప్ కు నెల రోజులు ఉందనగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం టీమిండియా క్రికెట్ లవర్స్ కు ఆనందం కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: