చెన్నై సూప‌ర్ కింగ్స్ ఈ ఏడాది ఐపీఎల్ లో జోరు మీద ఉంది. వ‌రుస గా అన్ని మ్యాచ్ ల‌లో విజ‌యం సాధిస్తూ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర స్థానంలో ఉంది. ఈ జ‌ట్టులో ప్ర‌తి ఆట‌గాడు మంచి ఫామ్ లో ఉన్నారు. తాజాగా శుక్ర వారం షార్జాలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తో జ‌రిగిన మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక లో రెండో స్థానం నుంచి మొద‌టి స్థానానికి ఎగ బాకింది. దీంతో చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానులు ఫుల్ ఖూషి లో ఉన్నారు. ఇదే ఉత్స‌హంలో ఈ ఏడాది కూడా ఐపీఎల్ క‌ప్పు చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టే కొట్టేస్తుందని జోస్యం చెబుతున్నారు.
అయితే శుక్ర‌వారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ పై చెన్నై విజ‌యం సాధించిన త‌ర్వాత ధోని మాట్లాడాడు. ఈ సంద‌ర్భంగా డ్వేన్ బ్రావో పై చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హెంద్ర సింగ్ ధోని ప్రశంసల జ‌ల్లు కురిపించాడు. డ్వేన్ బ్రావో చాలా ఫిట్ గా ఉంటాడ‌ని అన్నారు. మైధానంలో బ్రావో చాలా చురుకుగా ఉంటార‌ని అన్నారు. బ్రావో అనుకున్న ప్ర‌ణాళిక ల‌ను ప‌క్క‌గా అమ‌లు చేస్తాడ‌ని తెలిపారు. బ్రావో ను ధోని ఒక సోద‌రునిల చూస్తాడ‌ని అన్నారు. ఇప్పుడు కూడా బ్ర‌ద‌ర్ అనే పిలుస్తాన‌ని వివ‌రించాడు. కానీ త‌మ మ‌ధ్య ఒక్కొ సారి గొడ‌వులు జ‌రుగుతాయ‌ని చెప్పి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. ఈ గొడ‌వ‌లు బ్రావో బౌలింగ్ వేసేట‌ప్ప‌డు వ‌స్తాయ‌ని అన్నారు. బ్రావో కొన్ని బంతుల‌ను స్లోగా వెస్తాడ‌ని దీన్ని నేను వ్య‌తిరేకిస్తాన‌ని అన్నారు. ఈ టెక్న‌క్ గురించి అంద‌రికీ తెలుసు అని దీని వ‌ల్ల లాభం ఉండ‌ద‌ని తాను చెబుతాన‌ని అన్నారు. ఒక ఓవర్ ఆరు బంతులు భిన్నంగా వేయాల‌ని చెబుతాన‌ని ధోని అన్నారు.
కాగ శుక్ర వారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ తో జ‌రిగిన మ్యాచ్ లో బ్రావో అద్భుత మైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి, మాక్స్ వెల్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ వికెట్ల‌ను తీసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర వ‌హించాడు. అంతే కాకుండా ఇద్ద‌రు ప్ర‌ధాన మైన ఆట‌గాళ్ల ను అవుట్ చేసి ఆర్సీబీ ఓట‌మి కి కార‌ణం అయ్యాడు. దీనికి గాను బ్రావో కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వ‌చ్చింది. దీని కి ముందు ముంబాయ్ తో జ‌రిగిన‌ మ్యాచ్ లోనూ బ్రావో ఆల్ రౌండ‌ర్‌ రాణించాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల ను తీసి కేవలం 8 బంతుల్లోనే 23 ప‌రుగులు చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: