ఐపీఎల్ సీజన్ 14 ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. రోజు రోజుకీ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఐపీఎల్ మొదటి అంకంలో అద్భుతంగా ఆడి ప్లే ఆప్స్ కు తప్పక అర్హత సాదిస్తాయి అనుకున్న జట్లు తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబై మరియు బెంగుళూరు జట్లు శృతి తప్పినట్లు ఉన్నాయి. రెండవ అంకంలో యూఏఈ వేదికగా జరిగిన రెండు మ్యాచ్ లలోనూ ఓటమి చెంది ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటున్నాయి. ఇక మరో వైపు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న రెండు జట్లు మాత్రం దూసుకు వస్తున్నాయి. వాటిలో రాజస్థాన్ రాయల్స్ మరియు కేకేఆర్ జట్లు విజయాలతో మరింత ఉత్సాహంగా ఉన్నాయి. వీరి దూకుసు ఇదే విధంగా కొనసాగితే ప్లే ఆప్స్ లో ఖచ్చితంగా చోటు దక్కించుకుంటాయి.

అయితే ఐపీఎల్ మధ్యలో వాయిదా పాడడం వలన కొన్ని జట్లు విభిన్న వ్యూహాలతో ముందుకు వచ్చాయి. మరి కొన్ని జట్లు దారుణంగా దెబ్బ తింటున్నాయి. కానీ ఒక్క జట్టు మాత్రం మొదటి అంకంలో ఏ విధంగా అయితే ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆడిన మొదటి ఏడూ మ్యాచ్ లలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడింది. తర్వాత పరిస్థితులు చక్కబడడంతో యూఏఈ వేదికగా గత వారమే మిగిలిన మ్యాచ్ లు ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల క్రితం సన్ రైజర్స్ హైద్రాబాద్ తన 8 వ మ్యాచ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడింది. ఢిల్లీ టాస్ గెలిచి ఎస్ ఆర్ హెచ్ కు బ్యాటింగ్ అప్పగించింది.

మొదట బ్యాటింగ్ చేసిన విలియమ్సన్ సేన కేవలం 134 పరుగులకే పరిమితం అయింది. మంచి ఊపులో ఉన్న ఢిల్లీకి ఈ స్కోర్ సరిపోలేదు. ఈ  మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ చేతిలో దారుణంగా ఓడిపోయింది. దీనితో ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లో 7 ఓడిపోయి దాదాపుగా ప్లే ఆఫ్ అవకాశాలను దూరం చేసుకుంది. అయితే క్రికెట్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించలేము. ఈ రోజు కాసేపట్లో ఎస్ ఆర్ హెచ్ పంజాబ్ తో తలపడనుంది. ప్లే ఆప్స్ కి చేరుకున్నా గ్రూప్ లో గౌరవప్రదమయిన స్థానం అయినా సాధిస్తుందా చూడాలి. సీనియర్ల ఫామ్ ఈ జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది. మరి నేటి మ్యాచ్ లో సన్ రైజ్ అవుతుందా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: