ఈ రోజు ప్రారంభమైన టి20 ప్రపంచ కప్ 2021 మెగా టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు అలాగే స్కాట్లాండ్ జట్టు క్వాలిఫైయర్ మ్యాచ్లో తలపడుతున్నాయి. అయితే ఈ టోర్నీ నిర్వహణ హక్కులు మన భారత క్రికెయ్ కంట్రోల్ బోర్డుకే ఉన్న... మన దేశంలో ఉన్న కరోనా ఈ టోర్నీనీ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిపించాల్సి వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీలో 12 జట్లు పాల్గొననుండగా అందులో ఎనిమిది జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. మిగిలి ఉన్న నాలుగు స్థానాల కోసం పోటీ పడుతున్న జట్లలో ఈ రెండు జట్లు కూడా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ మహ్మదుల్లా బౌలింగ్ తీసుకొని ప్రత్యర్థి జట్టు అయినా స్కాట్లాండ్ మొదట బ్యాటింగ్కు పంపించాడు. అయితే బంగ్లాదేశ్ జట్టు ఈ మధ్యనే టీ 20 ఫార్మెట్లో ఆస్ట్రేలియా. న్యూజిలాండ్ వంటి మేటి జట్లను ఓడించింది. కానీ అంతకుముందు ఈ జట్టు ప్రదర్శన పేలవంగా ఉండటంతో ఈరోజు క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక స్కాట్లాండ్ జట్టు ఎప్పుడూ అంతంతమాత్రమే ప్రదర్శన చేస్తుందనేది తెలిసిందే. మరి ఈరోజు బంగ్లాదేశ్ వంటి ఓ మంచి జట్టును స్కాట్లాండ్ జట్టు ఓడించి క్వాలిఫైర్స్ లో ముందుకు వెళుతుంది అనేది చూడాలి మరి.

బంగ్లాదేశ్ : లిటన్ దాస్, సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా (c), అఫీఫ్ హొస్సేన్, నూరుల్ హసన్ (wk), మహేది హసన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్

స్కాట్లాండ్ : జార్జ్ మున్సే, కైల్ కోయిట్జర్ (c), మాథ్యూ క్రాస్ (wk), రిచీ బెర్రింగ్టన్, కాలమ్ మాక్లీడ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, జోష్ డేవి, సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లీ వీల్

మరింత సమాచారం తెలుసుకోండి: