ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు గా పేరొందిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈరోజు భారత పురుషుల సీనియర్ జట్టు యొక్క హెడ్ కోచ్ పదవులకోసం ఆహ్వానం ఇచ్చింది. అయితే బ్యాటింగ్ కోచ్. ఫీల్డింగ్ కోచ్ అలాగే బౌలింగ్ కోచ్ లకు కూడా దరఖాస్తులు చేసుకోవాలని భారత క్రికెట్ బోర్డ్ అధికారిక ప్రకటన చేసింది. వీటన్నిటితో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ లో మెడిసిన్ హెడ్ అలాగే స్పోర్ట్స్ సైన్స్‌ పదవులకు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే గత కొన్ని రోజులుగా భారత జట్టు యొక్క తదుపరి హెడ్ కోచ్ ఎవరు అనేదానిపై చాలా చర్చలు జరుగుతున్న సమయంలో ఈరోజు బీసీసీఐ ఆహ్వానాన్ని ఇవ్వడం విశేషం. ఇక హెచ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారికి ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఇచ్చింది బీసీసీఐ. ఆ సమయం దాటితే ఎలాంటి దరఖాస్తులు తీసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. అలాగే మిగిలిన పదవులనీటి కోసం వచ్చే నెల మూడవ తారీకు వరకు సమయం ఇస్తున్నట్లు ప్రకటించింది బీసీసీఐ.

అయితే ఇప్పటికే భారత హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ ను నియమించినట్లు చాలా వార్తలు వచ్చాయి. ఐపీఎల్ ఫైనల్ జరిగిన రోజు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సెక్రెటరీ జే షా తో కలిస ద్రావిడ్ తో సమావేశమై అతడిని ఈ పదవి కోసం ఒప్పించినట్లు సమాచారం. వచ్చింది. అయితే ఇప్పటికే నాలుగేళ్లుగా భారత హెడ్ కోచ్ పదవి నిర్వహిస్తున్న రవి శాస్త్రి సమయం సమయం ఈ నెలలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ముగియనుండటంతో బీసీసీఐ ఇప్పుడు ఈ ప్రకటనను విడుదల చేసింది. అలాగే ఫీల్డింగ్ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా ప్రపంచ కప్ అనంతరం ఆ బాధ్యతల నుండి నుంచి తప్పుకోనున్నారు. కానీ బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అలాగే కొనసాగనున్నాడు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: