ఐసీసీ టీ-20 2021 ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లు ఆదివారం యూఏఈ, ఓమ‌న్‌లో ప్రారంభం అయ్యాయి. తొలిరోజు నూత‌న రికార్డు న‌మోదైంది. బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హాస‌న్ ఈ రికార్డును సృష్టించాడు. మొద‌టిరోజునే ప్ర‌పంచ రికార్డు న‌మోద‌వ్వ‌డం విశేషం. తొలిరౌండ్‌లో స్కాట్లాండ్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లో పురుషుల అంత‌ర్జాతీయ టీ-20 క్రికెట్‌లో అత్య‌ధికంగా వికెట్లు తీసిన రికార్డును ష‌కీబ్ నెల‌కొల్పాడు. శ్రీ‌లంక  ఫాస్ట్ బౌలర్ ల‌సిత్ మలింగ రికార్డును రెండు వికెట్లు తీసి ప్ర‌పంచ‌రికార్డును న‌మోదు చేశాడు. 108 వికెట్లు తీసిన ష‌కీబ్ ప్ర‌స్తుతం అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

ప్ర‌పంచ‌క‌ప్‌లో 2007 నుండి అత‌ను ఆడుతున్నాడు. జ‌ట్టుకోసం అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌రకు అద్భుతంగా ప్ర‌ద‌ర్శ‌న చేస్తూనే ఉన్నాడు. మ్యాచ్ ఆరంభం కు ముందు అత‌ని పేరిట 106 వికెట్లు ఉన్నాయి. మ‌రో రెండు వికెట్లు తీయ‌డంతో రికార్డు న‌మోదైంది. తొలుత రిఫీ బారింగ్ట‌న్‌ను అఫిఫ్‌హుస్సెన్ క్యాచ్ ద్వారా మలింగ‌ను స‌మానం చేశాడు.  ఆ త‌రువాత కొద్ది సేప‌టికే అత‌ను వేసిన మూడవ ఓవ‌ర్‌లో నాలుగ‌వ బంతికి మైఖేల్‌లిష్ క్యాచ్‌ను లిట‌న్‌దాస్ అందుకున్నాడు. దీనితో రికార్డు న‌మోదైంది. అంత‌ర్జాతీయ టీ-20లో ష‌కీబ్ 108 వికెట్లు సాధించిన‌ ఘ‌న‌త ద‌క్కించుకున్నాడు. టీ-20లో 1000 కంటే ఎక్కువ ప‌రుగులు సాధించి, 100 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక క్రికెట‌ర్ గా నిలిచాడు ష‌కీబ్‌.

అతను 1700 కంటే ఎక్కువ ప‌రుగుల‌ను సాధించాడు. మ‌లింగ 84 మ్యాచ్ ల‌లో 107 వికెట్లు తీశాడు ప్ర‌స్తుతం రెండ‌వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన టిమ్‌సౌథి 83 మ్యాచ్‌ల‌లో 99 వికెట్లు తీసి మూడోస్థానంలో నిలిచాడు.  పాకిస్తాన్ మాజీ లెగ్‌స్పిన్న‌ర్ షాహిద్ అప్రిది 99 వికెట్ల‌తో నాల్గోస్థానం,  95 వికెట్లు తీసిన‌ అప్ఘ‌నిస్తాన్ లెగ్ స్పిన్న‌ర్ ర‌షీద్‌ఖాన్ ఐద‌వ‌స్థానంలో నిలిచాడు.  బంగ్లాదేశ్ త‌రుపున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇప్ప‌టివ‌రకు 600 వికెట్ల‌ను సాధించాడు ష‌కీబ్‌. దీంతో తొలి బంగ్లాదేశ్ బౌల‌ర్‌గా త‌న‌పేరును లిఖించుకున్నాడు. అత‌ను 362 మ్యాచ్‌లో ఈ ఘ‌న‌త సాధించాడు. మ‌రో ప్ర‌త్యేక‌విష‌య‌మేమిటంటే ఇప్ప‌టివ‌ర‌కు బంగ్లాదేశ్ బౌల‌ర్ ఎవ‌రు 400 వికెట్లు తీయ‌లేదు. ముష్ర‌ఫే మోర్తాజా 308 మ్యాచ్‌ల‌లో 389 వికెట్లు సాధించి  ష‌కీబ్‌ త‌రువాత రెండ‌వ స్థానంలో కొన‌సాగుతున్నాడు.మరింత సమాచారం తెలుసుకోండి: