యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిన్న 2021 టి20 ప్రపంచకప్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఇందులో ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇందులో నుండి నాలుగు జట్లు క్వాలిఫై అయిన తర్వాత సూపర్ 12 స్టేజ్ అక్టోబర్ 23 నుండి ఆరంభమవుతుంది. అయితే అక్టోబర్ 24న ఈ ప్రపంచ కప్లో టీమ్ ఇండియా తన ప్రయాణాన్ని పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మొదలుపెట్టనుంది. ఇక కెప్టెన్గా ఇదే విరాట్ కోహ్లీకి చివరి టీ 20 టోర్నీ కానున్న విషయం తెలిసిందే. దాంతో కెప్టెన్ కోహ్లి కోసమైనా భారత ఆటగాళ్లు అందరూ సమిష్టిగా రాణించి ట్రోఫీని అందుకోవాలని భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా టీమిండియాను కోరాడు.

అయితే నిన్న ప్రారంభమైన ఈ 2021 ప్రపంచకప్ తర్వాత తాను టీ-20 ఫార్మెట్లో భారత జట్టుకు కెప్టెన్గా ఉండడని కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఐపీఎల్ 2021 క్వాలిఫైయర్ కు చేరుకున్న బెంగళూరు జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. దాంతో ఐపీఎల్లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ప్రయాణం ముగిసింది. కాబట్టి ఈ ప్రపంచ కప్ లో నైనా కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్గా ఉన్నప్పుడు జట్టు ఐసిసి ట్రోఫీ అందుకోవాలని అభిమానులతో పాటు సురేష్ రైనా కోరుకుంటున్నాడు.

అయితే కెప్టెన్ గా ఇది కోహ్లీకి చివరి టోర్నమెంట్ అందుకే ఈ ప్రపంచకప్ అతనికి చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మకం గా ఉండాలి. ప్రపంచకప్ ను టీమిండియా ఆటగాళ్లు కోహ్లీ కోసం గెలవాలి. మన జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అందరూ కలిసి రానిస్తే విజయం మనదే అని రైనా పేర్కొన్నాడు. ఇక యూఏఈ లో పరిస్థితులు మన భారతదేశంలో మాదిరిగానమే ఉంటాయని అంతేకాకుండా ఇన్ని రోజులు అక్కడ ఐపీఎల్ ఆడిన అనుభవం ఆటగాళ్లకు ఉందని ఇది ఒక మంచి అవకాశమని తెలిపాడు రైనా. ఇక కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందుకోలేదు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: