భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు నిర్వహకులు ఉన్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభమైంది. అయితే ఈ టోర్నీలోనీ అసలు పోరు 12 స్టేజ్ అక్టోబర్ 23 నుండి ప్రారంభం కానుంది. అలాగే అక్టోబర్ 24న భారత్ ప్రపంచ కప్ లో తన మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది దాంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ మన భారత స్టార్ సానియా మీర్జా ఒక తలనొప్పి అని చెప్పాలి. ప్రతిసారి రెండు జట్లు తలపడినప్పుడు సానియా మీర్జా రెండు జట్ల అభిమానుల ట్రోలింగ్ మధ్య నలిగిపోతూ ఉంటుంది. ఆ కారణంగా ఈసారి ఈ రెండు జట్లు తలపడనున్న సందర్భంలో ఓ కొత్త నిర్ణయం తీసుకుంది సానియామీర్జా.

అయితే దాయాది దేశాలైన భారత జట్టు పాకిస్థాన్ జట్టు ఈ మెగా టోర్నీలో గ్రూప్ 2 లో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లు లీగ్ దశలోనే పోటీపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా అందులో గెలిచిన జట్టు అభిమానులు ఒదిన జట్టును ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఏ జట్టు గెలిచినా... ఏ జట్టు ఓడిపోయిన ట్రోల్ అయ్యే మొదటి వ్యక్తులలో సానియా మీర్జా ఉంటుంది. ఎందుకంటే సానియా మీర్జా కు మన భారత్ పుట్టినిల్లు కాగా పాకిస్థాన్ మెట్టినిల్లు. సానియా పాకిస్తాన్ స్టార్ ఆటగాడు అయిన షోయబ్ మాలిక్ ను 2010 లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అదే ఈ రెండు జట్లు తలపడగా సమయంలో తలనొప్పిని తెచ్చిపెడుతోంది. అయితే ఈ ప్రపంచ కప్ లో రెండు జట్లు పోటీ పడుతున్న సమయంలో అభిమానుల నుంచి తప్పించుకోవడానికి సోషల్ మీడియా నుండి మాయం కావాలని సానియా మీర్జా నిర్ణయం తీసుకుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న రోజు సోషల్ మీడియా నుండి తాను అదృష్టము అదృశ్యం అవుతున్నట్లు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సానియా మీర్జా.మరింత సమాచారం తెలుసుకోండి: