గత కొంత కాలం నుంచి టీమిండియాలో కీలక ఆల్రౌండర్గా మారిపోయాడు హార్దిక్ పాండ్యా. ఒక బౌలర్ గా బ్యాట్ మెన్ గా కూడా తన సత్తా చాటుతూ ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా కీలకంగా వ్యవహరిస్తూ టీమిండియాలో ఎంతో కీలకమైన ఆల్ రౌండర్ గా మారిపోయాడు హార్దిక్.  హార్దిక్ పాండ్యా ఎప్పుడూ తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు అనే విషయం తెలిసిందే.  బ్యాట్ పట్టుకొని మైదానంలోకి వచ్చినప్పటి నుంచి  వికెట్ కోల్పోయే వరకు ప్రతి బంతి బౌండరీకి తరలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.


 ఈ క్రమంలోనే అటు హార్దిక్ పాండ్యా ఆడుతుంటే క్రికెట్ ప్రేక్షకులు మ్యాచ్ వీక్షించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారూ. చూడటానికి బక్క పలచగా ఉండే హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు. అయితే గత కొంత కాలం నుంచి  బౌలింగ్ కి దూరంగా ఉన్నాడు హార్దిక్ పాండ్యా. భుజం గాయం నుంచి కోలుకున్నప్పటికీ అటు హార్దిక్ పాండ్యా మాత్రం బౌలింగ్ జోలికి వెళ్లక పోవడం గమనార్హం. ఇక అలాంటి హార్దిక్ పాండ్యా టి20 వరల్డ్ కప్ జట్టులో సెలెక్ట్ చేసింది బిసిసిఐ. ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయ పోతున్నాడా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే తన పర్సనల్ లైఫ్ గురించి  పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు హార్దిక్ పాండ్యా. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనకు ధోని అండగా ఉన్నాడు అంటూ టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య గుర్తుచేసుకున్నాడు. మొదటి నుంచి నన్ను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ధోని .. కష్ట సమయాల్లో నాకు ఫోన్ చేసి నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చిన మొదటి వ్యక్తి కూడా ఆయనే.. ధోని నాకు ఎంతో సన్నిహితుడు నా సోదరుడు అంటూ హార్దిక్ పాండ్య చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం హార్దిక్ పాండ్యా టి20 వరల్డ్ కప్ టీమిండియా జట్టులో స్థానం సంపాదించగా ఇక అదే జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు మహేంద్రసింగ్ ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి: