ఇండియా పాకిస్థాన్ క్రికెట్ జట్ల మ‌ధ్య ఎప్పుడూ మ్యాచ్ ఉన్న అటు అభిమానుల్లో ఇటు సెల‌బ్రెటీల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెల‌కొంటుంది. అలాగే ఇరు దేశాల‌కు చెందిన‌ ప్ర‌స్తుత క్రికేట‌ర్లు అలాగే మాజీ క్రికేట‌ర్లు ల మ‌ధ్య కూడా డైలాగ్ వార్ కూడా వాడి వేడి గా న‌డుస్తూ ఉంటుంది. ఏ వేధిక లో అయిన ఎప్పుడు అయిన ఇలాంటి వాతావ‌ర‌ణం అనేది త‌ప్పని స‌రిగా ఉంటుంది. అయితే టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ సంద‌ర్భంగా వ‌చ్చే ఆదివారం రోజు పాకిస్థాన్ తో ఇండియా ఢీ కోట్ట బోతుంది. అయితే ఈ మ్యాచ్ స‌మీపించ‌డం తో రోజు రోజు కు ఉత్కంఠ పెరిగి పోతుంది. ఇరు దేశాల‌కు చెందిన ఆట‌గాళ్ల మ‌ధ్య కూడా మాటల యుద్ధం పెరుగుతు వ‌స్తుంది. అందు లో భాగంగానే తాజా గా ఇండియా మాజీ ఆట‌గాడు హ‌ర్బ‌జ‌న్ సింగ్ పాకిస్థాన్ మాజీ ఆట‌గాడు షోయాబ్ అక్త‌ర్ పై ట్వీట్ట‌ర్ వేదిక గా పంచ్ వేశాడు. ప్ర‌స్తుతం ఈ పంచ్ ట్వీట్ట‌ర్ లో వైర‌ల్ గా మారింది.అయితే వ‌చ్చే ఆదివారం ఇండియా పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఉండ‌టంతో హ‌ర్బ‌జ‌న్ సింగ్, షోయాబ్ అక్త‌ర్ యూఏఈ కి చేరుకున్నారు. అనంత‌రం  ఈ ఇద్దరు కూడా ఒక చ‌ర్చ వేధిక లో పాల్గొన్నారు. అయితే వీరు పాల్గొన్న ఫోటో ను ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు పాక్ మాజీ పేస‌ర్ షోయాబ్ అక్త‌ర్. అయితే దీని పై టీమిండియా మాజీ స్పిన్న‌ర్ త‌న దైన శైలీ లో స్పందించి అక్త‌ర్ కు చుర‌క లు అంటించాడు. అయితే అక్త‌ర్ త‌న ట్వీట్ట‌ర్ అకౌంట్ లో ఇలా పోస్ట్ చేశాడు. అన్నీ తెలుసు అనుకునే మిస్ట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ తో భార‌త్ - పాక్ మ్యాచ్ కు ముందు దుబాయ్ లో ఒక చ‌ర్చా వేధిక‌లో పాల్గొన్నాను అని పోస్టు చేశాడు అక్త‌ర్. అయితే దీని పై బ‌జ్జీ టెస్టు ల్లో 200 క‌న్న త‌క్కువ వికెట్లు తీసిన ఆట‌గాడి కంటే.. 400 కి పైగా వికెట్లు తీసిన ఆట‌గాడి కే క్రికెట్ గురించి ఎక్కువ  తెలుసు అని ఘాటు గా బ‌దులు ఇచ్చాడు. దీంతో వీరి ట్వీట్ట‌ర్ వార్ ప్ర‌స్తుతం వైరల్ గా మారింది. పాక్ ఆట‌గాడి కి బ‌జ్జీ గ‌ట్టి పంచ్ వేశాడ‌ని నెట‌జ‌న్లు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: