ఐసీసీ ప్రపంచకప్ 2021లో ప్రస్తుతం జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్ లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్ జట్టు అలాగే ఒమాన్ జట్టు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు వచ్చిన బంగ్లాదేశ్ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ లిటన్ దాస్ ఏడు బంతుల్లో ఆరు పరుగులు చేయగా ఆ తర్వాత వచ్చిన మహేది హసన్ 4 బంతులు ఎదుర్కొని ఒక పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. దాంతో 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. కానీ ఆ తర్వాత వచ్చిన షకీబ్ అల్ హసన్.... ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ తో కలిసి స్కోర్ బోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో 42 పరుగులు చేసి షకీబ్ అల్ హసన్ రనౌట్ కాగా... అర్థ శతకం పూర్తి చేసిన ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ 50 బంతుల్లో 64 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన వారిలో నూరుల్ హసన్ 3 పరుగులు చేయగా అఫీఫ్ హుస్సేన్ ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ క్రమంలో కెప్టెన్ మొహమ్మద్ 10 బంతుల్లో 17 పరుగులు చేయగా చివర్లో ముష్ఫికర్ రహీమ్ నాలుగు బంతుల్లో ఆరు పరుగులు చేస్తే మహ్మద్ సైఫుద్దీన్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ముస్తాఫిజుర్ రహమాన్ మూడు బంతుల్లో 2 పరుగులు చేసి చివరి బంతికి ఔట్ కావడంతో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

ఇక ఒమాన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ మూడు వికెట్లు తీయగా ఫయాజ్ బట్ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. కలీముల్లా ఇక రెండు వికెట్లు తీస్తే కెప్టెన్ జీషన్ మక్సూద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఒమాన్ నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేయాలి. అయితే గత మ్యాచ్లో విజయం సాధించిన ఒమాన్ ఈ  మ్యాచ్లో కూడా గెలిస్తే దాదాపు సూపర్ 12 కు వచ్చినట్టే... అలాగే బంగ్లాదేశ్ ఓడిపోతే సూపర్ 12 పై ఆశలు వదులుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: