భారత్ పాకిస్థాన్ అనేవి చిరకాల ప్రత్యర్థులు అన్నది జగమెరిగిన సత్యం. ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు అభిమానులకు ఉండే ఆసక్తి వేరు. ఈ మ్యాచ్ కోసం ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే 2019 ప్రపంచ కప్ లో చివరిసారిగా తలపడిన ఈ రెండు జట్లు ఇప్పుడు యూఏఈ వేదికగా జరగనున్న టి20 ప్రపంచ కప్ లో ఈ నెల 24న దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. అయితే ఇప్పటికే ఈ మ్యాచ్లో విజయం ఎవరిది అనే దానిపై చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ మ్యాచ్ పై స్పందిస్తున్న భారత మాజీలు పాకిస్తాన్ ని తేలికగా తీసుకోకూడదు అంటుంటే... పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు మాత్రం ఈ మ్యాచ్ లో మేము ఇండియాలో చిత్తు చిత్తుగా ఓడిస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి పాకిస్థాన్ మాజీ పేసర్ గ్రౌండ్ లో ఎక్స్ప్రెస్ గా పేరొందిన షోయబ్ అక్తర్ కూడా చేరిపోయాడు.

అక్తర్ భారత జట్టును తక్కువ అంచనా వేయడంతో పాటు ఇదేమీ ఐపీఎల్ మ్యాచ్ కాదు అంటూ కామెంట్స్ చేశాడు. టీమిండియాతో జరిగే మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు 170, 180 పరుగులు చేస్తే చాలు అని అన్నాడు. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్ జట్టు భారత్ ముందు ఉంచగలిగితే వారిని కష్టాల్లోకి నేటినట్లే ఉంటుందని... ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఇదేం ఐపీఎల్ మ్యాచ్ కాదు... టి20 ప్రపంచ కప్ అని అన్నాడు. అలాగే ఈ మ్యాచ్లో రెండు జట్లకు విజయం కోసం సరిసమానమైన అవకాశాలు ఉన్నాయని అన్నాడు. అలాగే అందరూ పాకిస్తాన్ జట్టును తక్కువ అంచనా వేస్తున్నారు... కానీ పాకిస్థాన్ జట్టు ఈ ప్రపంచ కప్ గెలవగలదు. అందరిపైనా ఆధిపత్యం చెలాయించగలదు. ఇక పాక్ జట్టుతో మ్యాచ్లో భారత్ పైన ఎక్కువ ఒత్తిడి ఉంది. ఆ కారణంగా భారత జట్టు కృంగి పోయే అవకాశాలు ఉన్నాయి అక్తర్ కామెంట్స్ చేశాడు

మరింత సమాచారం తెలుసుకోండి: