యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రస్తుతం ఐసిసి టీ20 ప్రపంచ కప్ లో క్వాలిఫైయర్ మ్యాచ్స్ లతోపాటు వామప్ మ్యాచ్ లు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ తీసుకొని భారత్ ను మొదట బౌలింగ్కు పంపిస్తున్నాడు. అయితే ఈ వామప్ మ్యాచ్ ను రెండు జట్లు 12 మంది ఆటగాళ్లతో ఆడుతున్నాయి.
 
ఇక ఈ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే బౌలింగ్ విభాగంలో పేసర్లు జస్ ప్రీత్ బుమ్రా మరియు మొహమ్మద్ షమీ లకు విశ్రాంతిని ఇచ్చారు. అయితే బూమ్రా. షమీ గత వార్మప్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాబట్టి ఈరోజు వారిరువురికి విశ్రాంతిని ఇచ్చి మిగితా వారికీ అవకాశాలు ఇచ్చారు. అలాగే గత మ్యాచ్లో ఆడని రోహిత్ శర్మ. ఈ మ్యాచ్లో కోహ్లీ విశ్రాంతి కారణంగా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ లో ఆడుతున్నారు. ఈ ముగ్గురు కూడా గత మ్యాచ్లో ఆడని విషయం తెలిసిందే. దాంతో ప్రస్తుతం ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేసిన అందరికీ వామప్ మ్యాచ్లో అవకాశాలు ఇచ్చి వారి ఆట తీరును బట్టి అక్టోబర్ 24న పాకిస్థాన్ తో భారత్ ఆడనున్న మొదటి మ్యాచ్ కు జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే తుది జట్టులో ఉండాలనుకునే ఆటగాళ్ళు ఈరోజు ఆస్ట్రేలియాపై తమ ప్రతిభను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈరోజు ఆడుతున్న జట్టే రాణిస్తే దానినే పాకిస్థాన్ పై మొదటి మ్యాచ్ లో కొనసాగించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: