ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సూపర్ 12 స్టేజ్ దగ్గరికి వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఇప్పటికే ఎనిమిది జట్లు క్వాలిఫై అయ్యాయి. ఆ ఎనిమిది జట్లు ప్రస్తుతం వామప్ మ్యాచ్లో ఆడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు టీమిండియా అలాగే ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈరోజు మ్యాచ్లో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుకు అశ్విని షాక్ ఇచ్చాడు. మొదట ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఒక్క పరుగుకే వెనక్కి పంపిన అశ్విన్ ఆ తర్వాత మిచెల్ మార్ష్ ను గోల్డ్ డక్ గా అవుట్ చేశాడు. ఇక ఓపెనర్ కెప్టెన్ అయిన ఆరోన్ ఫించ్ 8 పరుగులు చేసి నిరాశపరిచాడు. కానీ ఆ తర్వాత స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్ ఇన్నింగ్సును చక్కదిద్దారు, ఆ క్రమంలో మాక్స్వెల్ 28 బంతుల్లో 37 పరుగులు చేసి ఔట్ కాగా... స్టీవ్ స్మిత్ 48 బంతుల్లో 57 పరుగులతో అర్థ శతకం చేసి చివరి ఓవర్లో అవుటయ్యాడు. అలాగే మార్కస్ స్టోయినిస్ 25 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దాంతో ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.

అయితే ఇది వామప్ మ్యాచ్ కాబట్టి ఏ ఆటగాడైనా మ్యాచ్ మధ్యలో జట్టులోకి రావచ్చు. మ్యాచ్ మధ్యలో వెళ్లిపోవచ్చు. ఆ కారణంగానే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో 12 పరుగులు ఇచ్చిన కోహ్లీ వికెట్ తీయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్ రెండు వికెట్లు తీయగా... భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అలాగే శార్దూల్ ఠాకూర్ మూడు ఓవర్లు వేసి 30 పరుగులు ఇవ్వగా... వరుణ్ చక్రవర్తి 2 ఓవర్లలో 23 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో వీరే అధికంగా పరుగులు ఇచ్చారు. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే భారత జట్టు 153 పరుగులు చేయాలి. అయితే గత వామప్ మ్యాచ్ లో గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తే పూర్తి ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైన టోర్నీ లోకి అడుగు పెట్ట కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: