భారత్, పాకిస్థాన్ జట్లు క్రికెట్ మ్యాచ్ లో తలపడుతున్నాయంటే ప్రపంచ దృష్టి మొత్తం ఆ మ్యాచ్ పైనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అయితే ఐసీసీ ప్రపంచ కప్లలో ఈ రేంజు జట్లు ఎదురుపడిన ప్రతిసారి మన ఇండియా దే విజయం అయింది. ఇక భారత మాజీ కెప్టెన్ దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసాడు. ఆ మ్యాచ్‌ యువ ఆటగాళ్లకే ఎక్కువ లాభం అని అన్నాడు. ఇందులో యువకులు బాగా రాణిస్తే వారు భారీ గుర్తింపు పొందవచ్చని అన్నారు. అయితే భారత్, పాక్ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడవు కాబట్టి, ఐసీసీ పోటీలలో వారి మ్యాచ్ లు ముఖ్యంగా అభిమానులకు మరింత కీలకంగా మారాయి. ఇదంతా ఒత్తిడి మరియు ఆనందం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఆటను ఆస్వాదిస్తుంటే మంచి ఫలితాలు వస్తాయి. అదే మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే... కోరుకున్న ఫలితాలు పొందలేరు అని కపిల్ దేవ్ వివరించారు.

ఇంకా, ఈ మ్యాచ్ లో ఏ యువ ఆటగాడు అయిన బాగా ఆడితే, అతను ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాడని... ఒక్క మ్యాచ్ తో స్టార్ ఆతడు అవుతాడని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లలో బాగా రాణించడం ద్వారా ఆటగాళ్లు గుర్తింపు పొందుతారు. ఒక యువకుడు బయటకు వచ్చి బాగా రాణిస్తే, అతను ప్రపంచ గుర్తింపు పొందుతాడు. అలాగే ఒక సీనియర్ ఆటగాడు ఈ మ్యాచ్ లో రాణించకపోతే, అది అతని ప్రతిష్టను దెబ్బతీస్తుంది, ఎక్కువ విమర్శలను తెచ్చి పెడుతుంది" అని కపిల్ దేవ్ తెలిపారు. అయితే విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు అక్టోబర్ 24, బుధవారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో సూపర్ 12 మ్యాచ్‌లో తమ మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్‌తో తలబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: