వరల్డ్ కప్ లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెట్ ఆటగాడు ఎంతగానో ఆశ పడుతూ ఉంటాడు. ఇక దీని కోసం ఎన్నో ఏళ్ల పాటు శ్రమిస్తూ ఉంటారు  వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఎన్నో రోజుల పాటు నిలకడగా ఫామ్ను కొనసాగిస్తే వరల్డ్ కప్ లో స్థానం దక్కుతుంది  అంతేకాదు అద్భుతమైన ప్రదర్శన తో సెలక్టర్ల ను ఆకట్టుకుంటే వరల్డ్ కప్ లో ఛాన్స్ దొరికితే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రతిభ కనబర్చి వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. అయితే అటు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టులో రషీద్ ఖాన్ కూడా స్థానం సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఒక్కసారిగా సూపర్ స్టార్ గా మారిపోయాడు. తన స్పిన్ మాయాజాలంతో కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు. తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఇలా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు రషీద్ ఖాన్. కాగా ఇటీవలే రషీద్ ఖాన్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే  పెళ్లి చేసుకుంటాను అంటూ రషీద్ ఖాన్ అంటున్నాడు అంటూ ఎన్నో వార్తలు వైరల్ గా మారిపోయాయి. ఇకపోతే తాజాగా ఈ వార్తలపై స్పందించాడు రషీద్ ఖాన్  ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ  కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే తాను ఎప్పుడూ అలా అనలేదు అంటూ రషీద్ ఖాన్ క్లారిటీ ఇచ్చాడు. రాబోయే కొన్ని సంవత్సరాలలో తనకు మరింత క్రికెట్ ఆడే అవకాశం ఉంది అంటూ రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఇక తన కెరీర్లో మరో మూడు వరల్డ్ కప్ లు కూడా ఉన్నాయని ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కంటే ఎక్కువగా వాటిపైనే దృష్టి పెడతాను అంటూ రషీద్ ఖాన్ చెప్పాడు.  ప్రస్తుతం ప్రపంచ కప్ లో పాల్గొనబోతున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టులో స్థానం సంపాదించుకున్న రషీద్ ఖాన్ తన జట్టును గెలిపించడానికి సిద్ధమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: