ఐసిసి టీ20 ప్రపంచ కప్ యొక్క నిర్వహణ హక్కులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కే ఉన్న... కరోనా కారణంగా దానిని భారత్ లో కాకుండా ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నిర్వహించాల్సి వస్తుంది. అయితే ఈ ప్రపంచ కప్ లో మొదటి నుండి మన టీం ఇండియా నే టైటిల్ ఫేవరెట్ అని చాలా మంది మాజీ ఆటగాళ్లు అన్నారు. కానీ దానిని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఒప్పుకోలేదు. భారత జట్టు ఐసిసి టోర్నీలో అంతగా రాణించడం లేదని... కాబట్టి ఐసిసి టీ20 ప్రపంచ కప్ లో 2019 వన్డే ప్రపంచకప్ లో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు టైటిల్ ఫేవరేట్ అని అన్నాడు. కానీ మైఖేల్ వాన్ తన మాటను మార్చేశాడు ఈ పొట్టి ప్రపంచకప్లో భారత జట్టు టైటిల్ ఫేవరెట్ అని చెప్పాడు.

అయితే ఈ ప్రపంచకప్ కు సూపర్ 12 ప్రారంభానికి ముందు జరిగిన వామప్ మ్యాచ్లో భారత జట్టు అదరగొట్టింది. దాంతో టైటిల్ గెలిచేందుకు టీమిండియా జట్టు ఫేవరేట్ అని మైఖేల్ వాన్ ఒప్పుకున్నాడు. అయితే ఈ ప్రపంచ కప్ కు ముందు జరిగిన రెండు వామప్ మ్యాచ్లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట ఇంగ్లాండ్ జట్టును ఓడించిన టీమిండియా... ఆ తర్వాత ఆస్ట్రేలియా ను కూడా సునాయాసంగా మట్టికరిపించింది. ఆ కారణంగానే భారత్ ఈ సారి టైటిల్ ఫేవరెట్ అని మైఖేల్ వాన్  చెప్పాడు.

అయితే ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా నిన్న టీమిండియాతో జరిగిన వామప్ మ్యాచ్ తర్వాత చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం గ్రూప్లో ఉన్న టీమిండియా ఈ నెల 24న ఆడనున్న మొదటి మ్యాచ్లో తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ జట్టును ఎదుర్కోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: