క్రికెట్ అభిమానులు ఎంతో ఆశ గా ఎదురుచూస్తున్న టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ దుబాయ్ వేదిక‌గా ఇప్ప‌టికే ప్రారంభ మైంది. ప్ర‌స్తుతం గ్రూప్ మ్యాచ్ లు జ‌రుగుతున్నాయి ఈ రెండు గ్రూపుల నుంచి టాప్ 4 స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్ 12 ద‌శ‌కు అర్హ‌త పొందుతాయి. ఈ నెల 23 వ తేదీ నుంచి సూప‌ర్ 12 మ్యాచ్ లు ప్రారంభ మ‌వుతాయి. ఏదేమైనా నేరుగా సూప‌ర్ 12కు అర్హ‌త సాధించిన అస‌లు జ‌ట్ల మ‌ధ్యే ప్ర‌పంచ‌క‌ప్ వేట అయితే ఉంటుంద‌ని చెప్పాలి. ఈ 8 జ‌ట్ల‌లో ఎవ‌రు సెమీ ఫైన‌ల్ కు వెళ‌తార‌న్న దానిపై ర‌క‌ర‌కాల అంచ‌నాలు ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే ఆసీస్ మాజీ క్రికెట‌ర్ , స్పిన‌ర్ బ్రాడ్ హాగ్ ప్ర‌పంచ క‌ప్ లో సెమీస్ కు వెళ్లే నాలుగు జ‌ట్లు ఏ యే జ‌ట్లు అవుతాయ‌న్న దానిపై త‌న విశ్లేష‌ణ చెప్పారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో హ‌గ్ త‌న టీంకు చోటు క‌ల్పించ లేదు. డిఫెండింగ్ చాంపియ‌న్ వెస్టిండిస్ తో పాటు మాజీ చాంపియ‌న్లు ఇండియా - ఇంగ్లండ్ - పాకిస్తాన్ సెమీస్‌కు వెళ‌తాయ‌ని చెప్పారు.

గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్ , వెస్టిండిస్ తో పాటు గ్రూప్ 2 నుంచి ఇండియా , పాకిస్తాన్ సెమీస్ కు వెళ‌తాయ‌ని హ‌గ్ చెప్పారు. ఇక్క‌డే హ‌గ్ మ‌రో విశ్లేష‌ణ చెప్పాడు. పాకిస్తాన్ చేతిలో భార‌త్ ఓడితే ఆ త‌ర్వాత న్యూజిలాండ్ తో జ‌రిగే మ్యాచ్ లో భార‌త్ ఆత్మ‌విశ్వాసం దెబ్బ తింటుంద‌ని చెప్పాడు. ఇక పాక్ భార‌త్ చేతిలో ఓడితే పాక్ కు సెమీస్ వెళ్లే అవ‌కాశాలు స‌న్ని గిల్లు తాయ‌ని లెక్క‌లు వేస్తున్నారు. ఏదేమైనా భార‌త్ - పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ కోసం యావ‌త్ ప్ర‌పంచ క్రికెట్ క్రీడాకారులు ఎంతో ఆస‌క్తి తో వెయిట్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: