టీం ఇండియా పై పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత జట్టు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్టు... యూఏఈ వేదికగా జరుగుతున్న 2021లో టీం ఇండియా ఛాంపియన్ గా నిలవడం ఖాయమని అన్నారు. అయితే అక్కడి పరిస్థితులు టీ 20 ఫార్మాట్లో భారత ఆటగాళ్లకు ఉన్న అనుభవం ఇలా ఏ విధంగా చూసినా భారత జట్టు చాంపియన్స్ గా నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపాడు. అయితే ప్రపంచ కప్ లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ లో మేమే విజయం సాధిస్తామని పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇంజమామ్ ఉల్ హక్ భారత్ ను ప్రశంసిస్తూ మాట్లాడుతూ... టోర్నీ లో ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేం. వారి అవకాశాల పైన విజయం ఆధారపడి ఉంటుంది. కానీ నా అంచనా ప్రకారం ఈ ప్రపంచ కప్ లో విజయం సాధించే అవకాశాలు అన్ని జట్ల కంటే భారత జట్టుకు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడి పరిస్థితులు వారికి బాగా తెలుసు. అలాగే జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాక వారంతా మంచి ఫాంలో కూడా ఉన్నారు. ఈ మధ్య జరిగిన ఐపీఎల్ లో వారు ఎలా ఆడారు మనమందరం చూశాం. కాబట్టి ప్రపంచకప్లో భారత ఆటగాళ్లు రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక సూపర్ 12 దశలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్... ఫైనల్ మ్యాచ్ కు ముందు మరో ఫైనల్ మ్యాచ్ లాంటిదని.. దీనికి ఉన్న క్రేజ్ మారె మ్యాచ్ కు ఉండదని... ఇది ఎప్పటి నుండో కొనసాగుతుందని అన్నాడు. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడిన ఒక ఫైనల్ మ్యాచ్ ను తలపిస్తుంది. ఇప్పుడు కూడా అదే ఉత్కంఠ కొనసాగుతోంది ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: