ఐపీఎల్ 2021 ముగియ‌డంతో అప్పుడే ఐపీఎల్ 2022 కు ఏర్పాట్లు షూరు చేశారు. రాబోయే ఏడాది ఐపీఎల్ ను బీసీసీఐ నిర్వ‌హించ‌డానికి ముమ్మురంగా ఏర్ప‌ట్లు చేస్తుంది. గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి కరోనా వైర‌స్ వ్యాప్త కార‌ణంగా అనేక అడ్డంకుల మ‌ధ్య ఐపీఎల్ మ్యాచ్ లు జ‌రిగియి. అవి కూడా మ‌న దేశం లో కాకుండా దుబాయ్ లో నిర్వ‌హించారు. అయితే వ‌చ్చే ఏడాది ఐపీఎల్ ను మ‌న దేశంలోనే ప‌క‌డ్బంది గా నిర్వ‌హించాల‌ని బీసీసీఐ భావిస్తుంది. అంతే కాకుండా ఐపీఎల్ లో జ‌ట్ల సంఖ్య ను పెంచాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంది. దీని కోసం ఇప్ప‌టికే టెండ‌ర్ల కు ఆహ్వానించింది. ఈ టెండ‌ర్ల గ‌డువు రెండు రోజుల క్రిత‌మే ముగిసింది. కొత్త గా రాబోతున్న జ‌ట్ల ను సొంతం చేసు కోవ‌డానికి చాలా మంది త‌మ టెండ‌ర్ల ల‌ను దఖాలు చేశారు.



కొత్త జ‌ట్ల ను సొంతం చేసుకొవ‌డానికి చాలా మంది ప్ర‌ముఖులు టెండ‌ర్లు ను వేశారు. అయితే ఈ లీస్ట్ లో బాలీవుడ్ హాట్ క‌పుల్స్ కూడా ఉన్న‌ట్టు తెలుస్తుంది. దీపికా ప‌దుకునే - ర‌ణ్ వీర్ సింగ్ లు కొత్త జ‌ట్టు ను సొంతం చేసుకునేందుకు టెండ‌ర్లు వేసిన‌ట్టు స‌మాచారం. అయితే ఇప్ప‌టికే ప‌లువురు బాలీవుడ్ న‌టులు ఐపీఎల్ జ‌ట్టు ల పై పెట్టుబ‌డులు పెట్టారు. ముందుగా కోల్ కత్త నైట్ రైడ‌ర్స్ కు య‌జ‌మానులు గా బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ ఉన్నారు. అలాగే పంజాబ్ కింగ్స్ జట్టు పై ఒక‌ప్ప‌టి హీరోయిన్  ప్రీతి జింత‌ పెట్టుబ‌డులు  పెట్టింది. అలాగే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు పై శిల్ప శెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా కూడా పెట్టుబ‌డులు  పెట్టారు. ఇప్పుడు వారి రూట్ లో దీపికా ప‌దుకునే ర‌ణ్ వీర్ సింగ్ న‌డుస్తున్నారు. అయితే వీరికి కొత్త జ‌ట్టు ద‌క్కుతుందో లేదో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: