టి20 ప్రపంచకప్‌ 2021 సూప‌ర్ - 12 పోటీలు శ‌నివారం నుంచి ప్రారంభ మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే గ్రూప్ ఏ, గ్రూప్ బీ అర్హ‌త పోటీలు ముగిశాయి. గ్రూప్ పోటీల నుంచి బంగ్లాదేశ్ , న‌మీబియా , శ్రీలంక , స్కాట్లాండ్ సూప‌ర్ 12 రౌండ్‌కు అర్హ‌త సాధించాయి. మిగిలిన దేశాల సంగ‌తి ఎలా ?  ఉన్నా న‌మీబియా చ‌రిత్ర క్రియేట్ చేసింద‌నే చెప్పాలి. న‌మీబియా తాము ఆడిన తొలి 20 ప్ర‌పంచ క‌ప్ లోనే సూప‌ర్ - 12 ద‌శ కు అర్హ‌త సాధించింది ఎన్నో సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది.

ఇంకా చెప్పాలంటే ఈ టోర్నీ లోకి న‌మీబియా రంగంలో కి దిగిన‌ప్పుడు ఆ జ‌ట్టు ఒక్క విజ‌యం అయినా సాధిస్తుంద‌ని ఎవ్వ‌రికి న‌మ్మ‌కాలు లేవు. ఇక శ్రీలంక తో జ‌రిగిన తొలి మ్యాచ్‌నే ఓట‌మి తో స్టార్ట్ చేసింది. అండ‌ర్ డాగ్స్ గా బ‌రిలో ఉండి శ్రీలంక తో జ‌రిగిన మ్యాచ్ లో ఓడిపోవ‌డంతో ఆ జ‌ట్టు ను అంద‌రూ లైట్ తీస్కొన్నారు. అయితే అనూహ్యంగా రెండో మ్యాచ్ లో నెద‌ర్లాండ్స్ ను ఓడించింది.

అయితే సూప‌ర్ - 12కు రావాలంటే ఖ‌చ్చితంగా గెల‌వాల్సిన మూడో మ్యాచ్ లో ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు అంతా క‌సితో ఆడారు. ముందు బ్యాటింగ్ చేసిన‌ ఐర్లాండ్‌ను 125 పరుగులకే కట్టడి చేశారు. ఆ త‌ర్వాత కెప్టెన్ ఎరాస్మ‌స్ 53 ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉండ‌డంతో ఉండ‌డంతో న‌మీబియా చాలా సులువు గానే ఐర్లండ్ ను ఓడించింది. ఇక నమీబియా 2003లో ద‌క్షిణాఫ్రికా లో జ‌రిగిన ప‌రిమిత ఓవ‌ర్ల ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా ఆడింది.

2019లో నమీబియా టి 20 ల్లోకి ఎంట్రీ ఇచ్చింది. టి20 ప్రపంచకప్‌లో సూపర్‌ 12కు అర్హత సాధించేందుకు నమీబియా కు కేవ‌లం 25 మ్యాచ్ లు అవ‌స‌రం అయ్యాయి. ఈ జ‌ట్టు 1993లో ఐసీసీ అసోసియేట్ హోదా పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: