టీ20 ప్రపంచకప్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌పంచ‌క‌ప్ టీ 20 టోర్న‌మెంట్ ఈ రోజు యూఏఈ వేదికగా గ్రాండ్ గా అరంభం కానుంది. తొలి రోజే ప‌టిష్ట‌మైన ఆస్ట్రేలియా , ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ టోర్న‌మెంట్‌కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది. దీనికి తోడు రేపు భార‌త్ - పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ కూడా అంద‌రిని తీవ్ర ఉత్కంఠ కు గురి చేస్తోంది. ఇక ఈ రోజు ఆస్ట్రేలియా , ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఎవ‌రు గెలుస్తారు ? ఎవ‌రిది పై చేయి అవుతుంది అన్న దానిపై ఎవ‌రి లెక్క‌ల్లో వారు ఉన్నారు.

ఆస్ట్రేలియా సుధీర్ఘ కాలంగా ప్ర‌పంచ క్రికెట్‌ను శాసించింది. మొత్తం గా ఐదు సార్లు ప‌రిమిత ఓవ‌ర్ల ప్ర‌పంచ‌క‌ప్ సొంతం చేసుకున్న ఘ‌న‌త ఆస్ట్రేలియా ది. ఇంకా చెప్పాలంటే గ‌త రెండున్న‌ర ద‌శాబ్దాలుగా ప్ర‌పంచ క్రికెట్ ను సైతం ఆస్ట్రేలియా శాసిస్తోంద‌నే చెప్పాలి. అయితే ఆసీస్ కు టీ 20 ప్ర‌పంచ క‌ప్ మాత్రం ఎప్పుడూ అంద‌ని ద్రాక్షే అవుతోంది.

గ‌త ఆరు టోర్నీల ను చూస్తే ఆ జ‌ట్టు 2010 లో ఫైనల్‌ చేరడం మినహా అంత‌కు మించి గొప్ప ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. ఆ జ‌ట్టు లో స్టార్ ఆటగాళ్లు సైతం ఇప్పుడు ఫేల‌వ ఫామ్ లో ఉన్నారు.  ఓపెనర్లు వార్నర్, ఫించ్‌ పేలవ ఆట తీరుతో నిరాశ ప‌రుస్తున్నారు. ఇక మిడిలార్డర్‌లో మ్యాక్స్‌వెల్ -  స్మిత్ - స్టొయినిస్ ల పైనే ప్ర‌ధానంగా భారం ప‌డుతోంది. ఆ జ‌ట్టుకు పేస్ బౌలింగ్ బాగున్నా యూఏఈ పిచ్ లు స్పిన్‌ల‌కు అనుకూలిస్తాయి. దీంతో ఇప్పుడు జంపా, అగర్ లు రాణించాల్సి ఉంది. ఏదేమైనా స్పిన్ బౌలింగ్ విభాగంతో పాటు బ్యాట‌ర్ల‌లో ద‌క్షిణాఫ్రికా కు కాస్త సానుకూల‌త క‌న‌ప‌డుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: