భారత క్రికెట్ చరిత్రలో రెండు ప్రపంచ కప్ లను సాధించిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఇప్పటివరకు ఏ కెప్టెన్ కు ఇది కూడా సాధ్యం కాలేదు అని చెప్పాలి. అయితే కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఇప్పటికే పలుమార్లు ప్రపంచకప్ ఆడినప్పటికీ కప్పు మాత్రం గెలవలేకపోయింది. అయితే ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని బిసిసిఐ దృఢ సంకల్పంతో ఉంది. ఈ క్రమంలోనే ఇక ఎంతో మంది యువ ఆటగాళ్లకు కూడా ఈసారి స్థానం కల్పించింది బిసిసిఐ. అయితే ఇక ఈ సారి టీమిండియాను మరింత బలంగా మార్చేందుకు అటు ప్రపంచ కప్ స్పెషలిస్ట్ గా పేరున్న మహేంద్రసింగ్ ధోనిని టీమిండియాకు మెంటార్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే.


 టీ-20 ఫార్మెట్లో కెప్టెన్గా తనదైన ముద్ర వేసిన మహేంద్రసింగ్ ధోని అనుభవం అటు యువ ఆటగాళ్లు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని అటు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా వ్యాఖ్యానించారు. కాగా ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ యూఏఈ లో టీమిండియాతో చేరిపోయి అందరి ఆటగాళ్లకు కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక రేపు పాకిస్థాన్తో తొలి మ్యాచ్ ఆడనుంది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే ధోని ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా ఆటగాళ్లతో కలిసి పని చేస్తున్నాడు. అయితే టీమిండియాకు మెంటార్ గా నియమించబడిన మహేంద్ర సింగ్ ధోనీ ఇక ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తాడు. త్రో డౌన్ స్పెషలిస్ట్ గా మారి బౌలింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు.  దీనికి సంబంధించిన ఫోటోలను బిసిసీఐ అభిమానులతో పంచుకుంది.


 టీమిండియా నూతన త్రో డౌన్ స్పెషలిస్ట్ మహేంద్రసింగ్ ధోని అంటూ పరిచయం చేస్తూ బిసిసిఐ ట్విట్ పెట్టింది. ఇక ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూస్తుంటే మహేంద్ర సింగ్ ధోనీ అటు టీమిండియా వరల్డ్ కప్  గెలవడానికి సాయశక్తులా సహాయ సహకారాలు అందిస్తున్నాడు అన్నది అర్థమవుతుంది. అయితే ఇలా టీమిండియాకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ధోని బిసిసిఐ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అనే విషయాన్ని ఇటీవలే బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: