ఐదేళ్లుగా ఎందోరినో ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చిన టీ 20 ప్రపంచ క‌ప్ ఎట్ట‌కేల‌కు దుబాయ్ , యూఏఈ వేదిక‌గా ఈ రోజు ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే క్వాలీఫ‌యింగ్ మ్యాచ్ లు ముగిశాయి. ఇక ఇప్పుడు ప్ర‌ధాన రౌండ్ అయిన సూప‌ర్ - 12 రౌండ్ పోటీలు ప్రారంభ మ‌య్యాయి. సూప‌ర్ 12 పోటీల్లో ఈ రోజు భార‌త జ‌ట్టు పాకిస్తాన్ తో త‌ల‌ప‌డుతోది. టోర్నీకే ఈ మ్యాచ్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ గా నిలుస్తోంద‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సూప‌ర్ 12 పోటీల్లో అర్హ‌త మ్యాచ్ ల ద్వారా వ‌చ్చిన 4 జ‌ట్ల‌ను వ‌దిలేస్తే మిగిలిన ఏడు జ‌ట్ల‌తో భార‌త్ కు ఏ జ‌ట్ల నుంచి ప్రధానంగా పోటీ ఉంటుంది ?  ఎవ‌రిని త‌ట్టుకుంటే భార‌త్ క‌ప్ ను గెల‌వ వ‌చ్చ‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మే.

ప్ర‌స్తుత వ‌న్డే క్రికెట్ చాంపియ‌న్ ఇంగ్లండ్ తో పాటు మాజీ చాంపియ‌న్ వెస్టిండిస్‌, ప్ర‌పంచ క‌ప్ ర‌న్న‌ర‌ప్ న్యూజిలాండ్ జ‌ట్ల తోనే ప్ర‌ధానంగా భార‌త్ కు గ‌ట్టి పోటీ త‌ప్ప‌దు. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌పంచ క‌ప్ కు ముందు నుంచే ఎలా రాటు దేలుతూ వ‌స్తోందో చూస్తూనే ఉన్నాం. అయితే వార్మ‌ప్ మ్యాచ్ లో ఆ జ‌ట్టును చిత్తు గా ఓడించి భార‌త్ కావాల్సినంత ఆత్మ విశ్వాసం అయితే పోగేసుకుంది. అయితే ఇంగ్లండ్ ను కీల‌క‌మైన‌ నాకౌట్ మ్యాచ్ ల‌లో న‌మ్మ‌డానికి వీలులేదు.

ఇక వెస్టిండిస్ జ‌ట్టు టీ 20 పోటీల్లో ఎంత ప్ర‌మాద కారో తెలిసిందే. ఈ జ‌ట్టులో విధ్వంస క‌ర‌మైన ఆట‌గాళ్లు ఉన్నారు. వీరు మ్యాచ్ ను క్ష‌ణాల్లో మార్చేస్తారు. పైగా ఈ ఫార్మాట్లో వెస్టిండిస్ జ‌ట్టు రెండు సార్లు చాంపియ‌న్ అయ్యింది. ఇక మూడో జ‌ట్టు కీవీస్‌. కీవీస్ ఎప్పుడు అయినా పెద్ద జ‌ట్ల‌కు షాక్ ఇచ్చేందుకు రెడీ గా ఉంటుంది. మొన్న ప్ర‌పంచ‌క‌ప్ సెమీ స్‌లో సైతం ఏకంగా భార‌త్ ను ఓడించింది. అందుకే ఈ మూడు జ‌ట్ల తో జ‌రిగే మ్యాచ్‌లో భార‌త్ జాగ్ర‌త్త‌గా ఉంటే క‌ప్‌ను గెలిచే అవ‌కాశాలు ఎక్కువుగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

T20