ఈ రోజు జరగబోయే దాయాదుల సమరానికి కొన్ని గంటలు మాత్రమే ఉంది. భారత్ లోని కోట్ల మంది అభిమానులతో పాటుగా ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులు సైతం ఈ మ్యాచ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఇది అక్షర సత్యం. ఇప్పుడే కాదు ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ జరిగినా ఇదే హీట్ ఉంటుంది. షెడ్యుల్ వచ్చినప్పటి నుండి ఎవరు గెలుస్తారు? ఎవరు బాగా ఆడుతారు? రికార్డులు ఎలా ఉన్నాయి? అంటూ రక రకాలుగా వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక అలాంటి అనాలిసిస్ కు మరియు ఊహలకు తెరపడే రోజు రానే వచ్చింది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 7 గంటలకు టాస్ మరియు 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది.

మరి ఈ మ్యాచ్ లో ఎవరి గెలుస్తారు అన్నది ఇప్పుడు అందరి మనసులోనూ మెదులుతున్న ప్రశ్న.  అయితే ఇందుకు సంబంధించి ఆటగాళ్ళ గురించి మాట్లాడడం మన చేతిలో ఉండదు. రెండు జట్లలోని ప్రతి ఆటగాడు ప్రతిభావంతుడు కాబట్టే వరల్డ్ కప్ జట్టులో ఉన్నారు. ఈ రోజు మ్యాచ్ దుబాయ్ లో ఉన్న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతున్నది. అయితే ఇటీవల ముగిసిన ఐపిఎల్ కూడా యూఏఈ లో జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ దుబాయ్ స్టేడియం లో కొన్ని మ్యాచ్ లు జరిగాయి. ఇక్కడ 13 మ్యాచ్ లు జరిగితే అందులో 9 మ్యాచ్ లు చేజింగ్ టీం లు గెలిచాయి.  కాబట్టి టాస్ గెలిచిన జట్టు క్షణం ఆలస్యం చేయకుండా ప్రత్యర్థిని బ్యాటింగ్ కు ఆహ్వానిస్తుంది.

ఈ ఒక్క కారణంతో మరియు  ఈ స్టేడియం లో ఇప్పటి వరకు ఉన్న రికార్డు తో టాస్ గెలిచిన జట్టునే విజయం వరిస్తుంది అని చెప్పగలం. కానీ ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయో చెప్పలేము. ఒకవేళ టాస్ గెలిచినా బ్యాటింగ్ తీసుకుంటే ఇక వారి ఖర్మ అని చెప్పాలి. మరి రికార్డు పరంగా అనుకున్నది జరుగుతుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: