మాజీ ఛాంపియన్స్ ఇండియా మరియు పాకిస్తాన్ ఆదివారం దుబాయ్‌లో జరిగే టీ 20 ప్రపంచ కప్ బ్లాక్‌ బస్టర్‌ మ్యాచ్ లో తలపడతాయి. అయితే ఈ ఆట చుట్టూ ఉన్న ఆకర్షణ ఉపఖండంలోని వైరుధ్య పొరుగు దేశాల మధ్య మ్యాచ్ యొక్క శాశ్వత ఆకర్షణను నొక్కి చెబుతుంది. అయితే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఇది మరొక మ్యాచ్ లాంటిందే అని అంతకు మించి ఏమి కాదు అని స్పష్టం చేసారు. కానీ బయట అభిమానుల మధ్య అలాగే మాజీ ఆటగాళ్ల మధ్య ఉన్న వాతావరణం చూస్తుంటే అలా కనిపించడం లేదు.

అయితే తాజాగా నాగ్‌పూర్ విమానాశ్రయంలో యోగా గురు బాబా రామ్‌దేవ్ విలేకరులతో మాట్లాడుతూ... నేడు జరగనున్న భారత్ - పాకిస్తాన్ టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ జాతీయ ప్రయోజనాలకు.. 'రాష్ట్రధర్మం'కి విరుద్ధమని అన్నారు. క్రికెట్ గేమ్ లో టెర్రర్ గేమ్ ఆడలేమని అన్నారు. LOC లో ఉద్రిక్తతల మధ్య నేడు జరగనున్న ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గురించి అడిగినప్పుడు బాబా రామ్ దేవ్ ఇలా అన్నాడు.

20వ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి  పొరుగువారు మనతో మూడుసార్లు యుద్ధానికి దిగ్గారు మరియు కాశ్మీర్ విషయంలో ఇప్పటికి వివాదాలు నెలకొల్పుతూనే ఉన్నారు. అయితే భారత్ చివరిసారిగా 2013లో ద్వైపాక్షిక సిరీస్‌లో పాకిస్థాన్‌కు ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ జట్లు కేవలం గ్లోబల్ టోర్నమెంట్‌లలో మాత్రమే కలుస్తున్నాయి. అలా చివరిగా 2019 ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచ కప్ లో తపాలపడ్డాయి. అయితే ఈ టీ 20 మరియు 50-ఓవర్ల ప్రపంచ కప్‌లలో కలిపి భారతదేశం పాకిస్తాన్‌పై 12-0 రికార్డును కలిగి ఉంది. 2007లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించి తమ తొలి టీ20 టైటిల్‌ను గెలుచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: