ఇండియా - పాకిస్థాన్ జట్ల మధ్య ఈరోజు ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఒదిన కారణంగా మొదట బ్యాటింగ్ కు వచ్చిన టీం ఇండియా కు మొదట్లోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ మొదటి ఓవర్లోనే గోల్డెన్ డక్ ఔట్ కాగా ఆ తర్వాత మరో ఓపెనర్ రాహుల్(3) పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ (11) కూడా నిరాశ పరిచాడు. కానీ అప్పటికే క్రీజులో కుదురుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ , పంత్ తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. వీరిరువు నాలుగో వికెట్ కు 53 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత పంత్ 39 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద ఔట్ కాగా అయినా విరాట్ కోహ్లీ తన క్లాస్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలో అర్థ శతకం పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 57 పరుగులు చేసిన తర్వాత అవుటయ్యాడు. అయితే అంతకుముందే రవీంద్ర జడేజా 13 బంతుల్లో 13 పరుగులు చేసి వెను తిరిగాడు. ఇక హార్దిక్ పాండ్యా చివర్లో 8 బంతుల్లో 11 పరుగులు చేయగా భువనేశ్వర్ కుమార్ 4 బంతుల్లో 5 పరుగులు చేశాడు. దాంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది.

ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బోర్డర్ షహీన్ ఆఫ్రిది మూడు వికెట్లు తీయగా... హసన్ అలీ రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 152 పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే నా బలమైన భారత బౌలింగ్ ఉండు పాకిస్తాన్ ఈ లక్ష్యాన్ని చేస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: