ఇటీవలే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ని ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది క్రికెట్ ప్రేక్షకులు వీక్షించారు. కేవలం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనే కోటి మందికి పైగా ప్రేక్షకులు వీక్షించారు అంటే ఇక టీవీ లో కూడా ఎంతమంది వీక్షించి ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతే కాదు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా యూఏఈ చేరుకొని ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించారు.  అయితే గతంలో పాకిస్థాన్ జట్టుపై భారతదే పూర్తి ఆధిపత్యం ఉండేది.  ఇప్పటివరకు ఒక్క సారి కూడా పాకిస్థాన్ జట్టు భారత్ పై గెలిచిన దాఖలాలు లేవు. దీంతో ఇక నిన్న జరిగిన పాకిస్తాన్ భారత్ మ్యాచ్ లో టీమిండియా జట్టు హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది.


 కానీ అటు పాకిస్థాన్ బౌలర్లు మొత్తం సమష్టిగా రాణించడంతో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. పాకిస్తాన్ బౌలర్ల ధాటికి టీమిండియా ఆటగాళ్లు పరుగులు చేయడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు. అతికష్టంమీద 150 పరుగులు చేశారు టీమిండియా ఆటగాళ్లు. ఈ క్రమంలోనే ఆ తరువాత బ్యాటింగ్ చేసిన  పాకిస్థాన్ జట్టు అలవోకగా టీమిండియా ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించింది. అది కూడా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పాకిస్థాన్ జట్టు అద్భుతంగా రాణించింది అని చెప్పాలి.  ఇక చివరికి పాకిస్థాన్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. దీంతో టీమిండియా జట్టు కు ఊహించని షాక్ తగిలింది. అయితే నిన్న ఓటమి తోనే షాక్ లో ఉన్న టీమిండియా కు మరో షాక్ కూడా తగిలింది. నిన్న మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కు గాయం అయింది అన్న విషయం తెలిసిందే.


 గతంలోనే భుజానికి గాయం కావడంతో కొన్ని రోజులనుంచి బౌలింగ్ కు దూరంగా ఉన్నాడు హార్దిక్ పాండ్యా. అయితే ఇప్పుడు మరోసారి హార్దిక్ పాండ్యా భుజానికి బలంగా బంతి తగలడంతో పాత గాయం మళ్లీ పెద్దది అయినట్లు తెలుస్తుంది. దీంతో అతడు ఆ తర్వాత  ఫీల్డింగ్ చేయడానికి కూడా రాలేదు. హార్థిక్ పాండ్య స్థానంలో ఇషాన్ కిషన్ చేశాడు.  అయితే హార్దిక్ పాండ్యా బుజానికి స్కానింగ్ తీసినట్లు బిసి వర్గాలు తెలిపాయి. ఇక ఈ నెల 31వ తేదీన న్యూజిలాండ్తో  తర్వాత మ్యాచ్ ఆడబోతుంది  టీమ్ ఇండియా. ఇక ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: