ఎన్నో ఆశలతో మరియు అంచనాలతో వరల్డ్ కప్ వేట మొదలు పెట్టిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. తన దాయాది దేశమైన పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోరమైన ఓటమిని చవి చూసింది. అయితే మ్యాచ్ కు ముందు భారత్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏదో అయిందేదో అయిపోయింది. ఇక దానినే తలుచుకుంటూ కూర్చుంటే తగదు. ఇలా మొదటి మ్యాచ్ ఓటమితో భారత్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. గ్రూప్ 2 లో ఉన్న మొత్తం ఆరు జట్లలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఇక మిగిలింది నాలుగు మ్యాచ్ లు కావడంతో ప్రతి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి.

ఈ గ్రూప్ లో ఉన్న న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లతో భారత్ తన మిగిలిన మ్యాచ్ లు ఆడనుంది. అయితే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, నమీబియా మరియు  స్కాట్లాండ్ జట్లతో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ న్యూజిలాండ్ టీమ్ తో సవాల్ ఎదురు కావొచ్చు. కానీ మిగిలిన మూడు జట్లతో భారీ తేడాతో గెలిస్తే ఒకవేళ న్యూజిలాండ్ తో ఓడినా సెమీస్ కు చేరొచ్చు. కానీ ఇలా జరగడం వల్ల సెమీస్ చేరడానికి అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి మిగిలిన నాలుగు మ్యాచ్ లు తప్పక గెలవాలి అప్పుడే సెమీస్ కు చేరే అవకాశం ఉంటుంది.

గత మ్యాచ్ లో ఇబ్బందిగా మారిన జట్టు కూర్పు విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. హర్ధిక్ ఫిట్ గా లేనప్పుడు తుది జట్టులోకి ఎందుకు తీసుకున్నారో తెలియడం లేదు? ఇక యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ను తీసుకుంటే ధాటిగా ఆడి వీలైనన్ని పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లకు సవాల్ విసరగలడు. ఇక శార్ధూల్ ఠాకూర్ ను తుది జట్టులో ఆడించడం మంచిది. భువనేశ్వర్ విషయంలోనూ మరో సారి ఆలోచిస్తే బాగుంటుంది. ఇకపై ప్రతి మ్యాచ్ చాలా కీలకం కాబట్టి ఖచ్చితంగా కోహ్లీ సేన మేల్కొని విజయాలను సాధించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సంచలనాలు జరగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: