టి20 వరల్డ్ కప్ లో భాగంగా చిలకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ హై వోల్టేజీ మ్యాచ్ ను ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు మొత్తం ఎంతో ఆసక్తిగా వీక్షించారు. అయితే ఈ మ్యాచ్లో హాట్ ఫేవరేట్గా టీమిండియా బరిలోకి దిగింది. కానీ పేలవ ప్రదర్శనతో చివరికి ఓటమి చవిచూసింది టీమిండియా. అయితే ఇప్పుడు వరకు టీమిండియా ఒక్కసారి కూడా పాకిస్థాన్ చేతిలో ఓడిపోలేదు కానీ మొట్టమొదటిసారి పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక పాకిస్తాన్ జట్టు అన్ని విభాగాల్లో కూడా బాగా రాణించి అద్భుతమైన విజయాన్ని సాధించింది.


 ఈ విజయంతో విజయంతో అటు పాకిస్థాన్ జట్టు సరికొత్త చరిత్రకు నాంది పలికింది అని చెప్పాలి.  భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ముగిసిపోయింది. అయినప్పటికీ ఈ మ్యాచ్ కి సంబంధించిన వేడి మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే మొదటి సారి భారత్ పాకిస్థాన్ చేతిలో ఓడిపోవడం.. అది కూడా ఘోరపరాభవం ఎదురుకావడాన్ని మాత్రం అటు మాజీ క్రికెటర్లు ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే టీమ్ సెలక్షన్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉండటం గమనార్హంm టీమిండియా పై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి.



 అయితే ఇటీవలే టీమ్ సెలక్షన్ పై విమర్శలు రాగా ఇదే విషయంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై సూచనలు చేసాడు హర్భజన్ సింగ్. రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ మూడవ స్థానంలో.. కె.ఎల్.రాహుల్ నాలుగవ స్థానంలో.. రిషబ్ పంత్ ఐదవ స్థానంలో ఆడితే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.. హార్దిక్ పాండ్యా ఆరవ స్థానంలో, రవీంద్ర జడేజా ఏడవ స్థానంలో, శార్దూల్ ఠాకూర్ ఎనిమిదవ స్థానంలో వస్తే టీమిండియాకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత మిగతా వాళ్ళు బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: