టీ 2O వరల్డ్ కప్ 2021 లో భాగంగా సూపర్ 12 మ్యాచ్ లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల ఆధారంగా అప్పుడే సెమీఫైనల్ చేరే జట్లు ఇవేనంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. కాగా ఆదివారం పాకిస్తాన్ ఇండియా ల మధ్య జరిగిన మ్యాచ్ ను ఇంకా భారత్ అభిమానులు మరిచిపోయి ఉండరు. ఎందుకంటే ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు ఉన్న రికార్డు తగ్గిపోవడమే దీనికి కారణం. గ్రూప్ 2 లో ప్రస్తుతం ఆడిన ఒక్క మ్యాచ్ లో ఘన విజయం సాధించిన ఆఫ్గనిస్తాన్ మరియు పాకిస్తాన్ జట్లు వరుసగా మెదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ రోజు మరొక కీలక మ్యాచ్ జరుగుతోంది. న్యూజిలాండ్ పాకిస్తాన్ తో షార్జా వేదికగా తలపడుతోంది.

మొదట టాస్ గెలిచిన పాక్ ఫీల్డింగ్ తీసుకుంది. మొదటి మ్యాచ్ లో గెలుపు పాక్ కు మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగడానికి సహాయం చేసింది. అయితే ఈ మ్యాచ్ లో భారత అభిమానులు ఒక్కటే కోరుకుంటున్నారు. ఎలాగైనా పాకిస్తాన్ ఓడాలి అని, ఎందుకంటే గ్రూప్ 2 లో ఉన్న జట్లలో భారత్, పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ లో అగ్ర జట్లు. కాబట్టి ఈ మ్యాచ్ పాకిస్తాన్ గెలిస్తే ఇక మిగిలిన మ్యాచ్ లు అన్నీ తనకు ఈజీగానే ఉంటాయి. పైగా వాటిలో కనీసం రెండు గెలిచిన సెమీస్ బెర్త్ కంఫర్మ్. అదే సమయంలో భారత్ మిగిలిన అన్ని మ్యాచ్ లను గెలిస్తేనే సెమీస్ చేరగలదు.

అందుకే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే ఆఖరి వరకు భారత్ లాగే సెమీఫైనల్ బెర్త్ కోసం ఎదురుచూసే పరిస్థితి వస్తుందనే ఒక చిన్న ఆశ. ఏ ఈవిధంగా చూసుకున్న ఈ మూడు జట్ల నుండి మాత్రమే రెండు సెమీస్ చేరుకుంటాయి. మొత్తం 5 మ్యాచ్ లు ఆడనుండగా 4 మ్యాచ్ లు గెలిచిన రెండు జట్లు సెమీస్ చేరతాయి. లేదా అయిదు గెలిస్తే మరీ మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 మ్యాచ్ లు గెలిచే అవకాశం ఎవ్వరికీ ఉండకూడదు. ఇది ప్రతి సగటు భారతీయుడు కోరుకునే విషయమే. అందుకే ఈ మ్యాచ్ లో కివీస్ గెలిచి పాక్ ఓడిపోవాలి. మరి ఎలా జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: