యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా మన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తున్న 2021 ఐసిసి టీ 20 ప్రపంచ కప్ విజయం గా ముందుకు సాగుతుంది. అయితే ఈ ప్రపంచ కప్ లో నేడు మన భారత జట్టును ఓడించిన పాకిస్తాన్ జట్టుతో న్యూజిలాండ్ జట్టు తలపడుతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ బౌలింగ్ తీసుకొని కివీస్ జట్టును మొదట బ్యాటింగ్ కు పంపించాడు. ఈ మ్యాచ్ కు షార్జా క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. అయితే పాకిస్తాన్ జట్టు ఏ విధమైన మార్పులు లేకుండానే ఈ మ్యాచ్ బరిలోకి దిగుతుంది. ఇక న్యూజిలాండ్ జట్టుకు ఈ ప్రపంచ కప్ లో ఇదే మొదటి మ్యాచ్ అనే విషయం తెలిసిందే. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ఈ టోర్నీ ని శుభప్రదంగా ప్రారంభించాలని కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ జట్టు చూస్తుంటే... గత మ్యాచ్లో భారత జట్టు పై సాధించిన విజయం యొక్క ఊపుతో ఇందులోని గెలవాలని పాకిస్తాన్ చూస్తుంది. అయితే ఈటోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ కు వెళ్లిన కిసీస్ జట్టు భద్రత కారణాల కారణంగా వెన్నకి వచేయగా.. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని కూడా పాక్ భావిస్తుంది.

కివీస్ జట్టు : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్( c ), డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, టిమ్ సీఫెర్ట్(wk), మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్

పాక్ జట్టు : మహ్మద్ రిజ్వాన్( wk ), బాబర్ ఆజమ్( c ), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది

మరింత సమాచారం తెలుసుకోండి: