టి20 వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచి త్రుటిలో విశ్వవిజేత స్థానాన్ని చేజార్చుకున్న న్యూజిలాండ్ జట్టు టి-20 వరల్డ్ కప్ ముగియగానే ప్రస్తుతం భారత్లో పర్యటిస్తుంది విషయం తెలిసిందే. ఇక భారత పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ లో ఆడుతుంది. ఇక టి20 సిరీస్ లో భాగంగా ఇటీవల వరుసగా మూడు మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది. సొంతగడ్డపై ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియాతో మొదటి టి20 సిరీస్ అందుకోవడం గమనార్హం.


 అయితే టి20 సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిన న్యూజిలాండ్ జట్టు టెస్టు సిరీస్లో మాత్రం పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే భారత పిచ్ లకు అనుగుణంగా పదునైన వ్యూహాలతో రంగంలోకి దిగాలి అని భావిస్తోంది కివీస్ జట్టు. ఇటీవలే న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టేడ్ టెస్ట్ సిరీస్ వ్యూహలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ పరిస్థితులనుబట్టి అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నవంబర్ 25వ తేదీన న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ కాన్పూర్ స్టేడియంలో జరగబోతుంది.



 అయితే ఈ మ్యాచ్ కి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరు అవుతూ ఉండడంతో అజింక్య రహానే టీమ్ ఇండియా కెప్టెన్ గా ముందుకు నడిపించనున్నాడు. అయితే ఇక ఇటీవలే ఈ టెస్టు సిరీస్పై మాట్లాడినా న్యూజిలాండ్ జట్టు హెడ్ కోచ్ ఇంతకు ముందు భారత పర్యటనకు వచ్చిన జట్లు ఎందుకు విఫలం అయ్యాయి అనే విషయాన్ని పరిశీలించాము. ఆ తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాం. ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగితే పిచ్లపై ప్రభావం చూపలేము. అందుకే ముగ్గురు స్పిన్నర్ లతో తుది జట్టులోకి తీసుకుంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొలి మ్యాచ్లో విజయం సాధిస్తే ఇక తర్వాత మ్యాచ్లో కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. ఇక పిచ్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ ఉండాలి అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: